Asianet News TeluguAsianet News Telugu

'సామీ సామీ'.. కిక్కిచ్చే నాటు సాంగ్ ఇదిగో.. బి, సి సెంటర్స్ దుమ్ము దుమారమే!

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న పుష్ప ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యేలా ఒక్కో అప్డేట్ వస్తోంది. తాజాగా మాస్ ప్రేక్షకులు కేరింతలు పెట్టేలా అదిరిపోయే నాటు సాంగ్ విడుదలయింది.

Saami saami song from Allu Arjun  Pushpa is out now
Author
Hyderabad, First Published Oct 28, 2021, 11:51 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న పుష్ప ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యేలా ఒక్కో అప్డేట్ వస్తోంది. తాజాగా మాస్ ప్రేక్షకులు కేరింతలు పెట్టేలా అదిరిపోయే నాటు సాంగ్ విడుదలయింది. పుష్ప చిత్రంలోని 'సామీ సామీ' లిరికల్ సాంగ్ ని కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

గేయ రచయిత చంద్రబోస్ తన లిరిక్స్ తో ఈ సాంగ్ కు పల్లెటూరి మాస్ ఫ్లేవర్ తీసుకువచ్చారు. ముఖ్యంగా బి అండ్ సి సెంటర్స్ లో దుమ్ములేచిపోయే విధంగా ఈ సాంగ్ ని Devi Sri Prasad ట్యూన్ చేయడం విశేషం. 'బంగరు సామీ, మీసాల సామీ, రోషాల సామీ అంటూ మంచి మాస్ బీట్ తో పాట జోరుగా సాగుతోంది. 

నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామీ.. నువ్వు ఎల్లే దారి సుత్తావుంటే ఏరే ఎండినట్టుందిరా సామీ.. అంటూ చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. అల్లు అర్జున్ గెటప్, మ్యానరిజమ్స్.. రష్మిక పల్లెటూరి అందాలతో థియేటర్స్ మోతెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Rashmika Mandanna మందన మాస్ స్టెప్పులు కుర్రాళ్లకు కనువిందు చేయనున్నాయి. పల్లెటూర్లలో ఆటోలు, ట్రాక్టర్లు లో ఈ సాంగ్ మోతెక్కుతుంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మీరు కూడా సామీ సామీ లిరికల్ సాంగ్ పై ఓ లుక్కేయండి. 

 

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా చిత్రంగా సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. బన్నీ ఈ మూవీలో ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios