'మహానటి'కి బన్నీ స్పెషల్ పార్టీ!

allu arjun special party to mahanati team
Highlights

'మహానటి' సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు 

'మహానటి' సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన 'మహానటి' టీమ్ ను అందరూ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలతో పాటు రాజకీయనాయకులు కూడా ఈ సినిమా అద్భుతమని కొనియాడుతున్నారు.

నిన్న మెగాస్టార్ చిరంజీవి మహానటి చిత్రబృందాన్ని ఇంటికి పిలిపించి మరీ సన్మానించారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సినిమా టీమ్ కోసం స్పెషల్ పార్టీ ఎరేంజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమాకు పోటీగా 'మహానటి' విడుదలైంది. బన్నీ సినిమా కాస్త డల్ గా సాగుతుంటే మహానటి మాత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతుంది. కొన్ని చోట్ల నా పేరు సూర్య సినిమాను థియేటర్ లో నుండి తీసేసి మరీ మహానటి వేస్తున్నారు.

కానీ ఈ విషయాలను పట్టించుకోకుండా ఈ చిత్రబృందాన్ని అభినందించాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో మహానటి టీమ్ కోసం గ్రాండ్ పార్టీ నిర్వహిస్తున్నాడు.ఈ పార్టీకు మహానటి టీమ్ తో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. 
 

loader