అల్లు అర్జున్ కొత్త కథ 'సభకు నమస్కారం'!

allu arjun's sabhaku namaskaram
Highlights

తాజాగా నిర్మాత దిల్ రాజు ఓ స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ ని కలిసినట్లు సమాచారం. ఆ కథను 'సభకు నమస్కారం' అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారు. బన్నీకి కూడా కథ బాగా నచ్చింది. నిజానికి దిల్ రాజు ఈ కథను మరో స్టార్ హీరోతో చేయాలనుకున్నాడు. కానీ చివరకు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లాడు. డైరెక్టర్ మాత్రం ఇంకా ఖరారు కాలేదని సమాచారం

'సరైనోడు' సినిమా తరువాత అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం','నా పేరు సూర్య' సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. దీంతో తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ ఫిలిం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో కలిసి సినిమా చేయాలని అనుకున్నాడు. విక్రమ్ చెప్పిన కథ నచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చేయమని సూచించాడట బన్నీ. కానీ అతడు రెడీ చేసిన వెర్షన్ బన్నీకి నచ్చకపోవడంతో మరికొంత సమయం ఇవ్వాలని అనుకున్నాడు. కానీ తాజాగా నిర్మాత దిల్ రాజు ఓ స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ ని కలిసినట్లు సమాచారం.

ఆ కథను 'సభకు నమస్కారం' అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారు. బన్నీకి కూడా కథ బాగా నచ్చింది. నిజానికి దిల్ రాజు ఈ కథను మరో స్టార్ హీరోతో చేయాలనుకున్నాడు. కానీ చివరకు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లాడు. డైరెక్టర్ మాత్రం ఇంకా ఖరారు కాలేదని సమాచారం. విక్రమ్ కుమార్ కథ గనుక ఫైనల్ అయితే ముందుగా ఆ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత దిల్ రాజు సినిమా చేసే ఛాన్స్ ఉంది. లేదంటే గనుక ముందుగా దిల్ రాజు సినిమాను మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారట.

ఆ కారణంగానే ఇటీవల సోషల్ మీడియాలో కొంతకాలం వేచి ఉండమని తన అభిమానులను కోరాడు బన్నీ. తన తోటి హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంటే బన్నీ మాత్రం ఆ విషయంలో వెనుకబడుతున్నాడు. ఈ ప్రెషర్ లో సినిమా చేయకూడదని అన్నీ ఆలోచించుకొని సినిమాకు సిద్ధపడాలని ఫిక్స్ అయ్యాడు. మరి ముందుగా ఏ ప్రాజెక్ట్ మొదలవుతుందో చూడాలి!

loader