వేదం చిత్రం 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ తో పోస్ట్ చేశారు.

కొన్ని చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కావు. కానీ ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేస్తాయి. ఏళ్ల తరబడి ప్రేక్షకులు ఆ చిత్రాలని గుర్తుంచుకుంటారు. ఆ కోవకి చెందిన చిత్రమే అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క శెట్టి కలసి నటించిన వేదం. 

15 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'వేదం' 

2010 జూన్ 4న విడుదలైన వేదం సినిమాఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. సహజసిద్ధమైన పాత్రలతోనే కథని వైవిధ్యంగా తీర్చి దిద్దారు డైరెక్టర్ క్రిష్. ఈ చిత్రంలో అల్లు అర్జున్, మనోజ్, అనుష్క నటన ఈ చిత్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బుధవారం రోజుతో ఈ చిత్రం విడుదలై 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులు, సహనటులు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

అల్లు అర్జున్ పోస్ట్ 

అల్లు అర్జున్ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.. వేదం చిత్రం 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇది నేను కలలో కూడా ఊహించని చిత్రం. ఈ చిత్రాన్ని ఎంతో నిజాయతీతో తెరకెక్కించిన డైరెక్టర్ క్రిష్ కి కృతజ్ఞతలు. నా సహచర నటీనటులు మంచు మనోజ్, అనుష్క శెట్టి, మనోజ్ బాజ్ పాయి సర్, ఇతర చిత్ర యూనిట్.. మీతో కలసి జర్నీ చేయడం నా లైఫ్ లో ప్రత్యేకమైన అనుభూతి. సంగీతం అందించిన కీరవాణి గారికి, నిర్మాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు అని అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. అలాగే, "వేదం సినిమాను ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఈ సినిమాను టైమ్‌లెస్‌గా మార్చారు" అని పేర్కొన్నారు.

వేదం చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తీసుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనుష్క శెట్టి బ్లాక్‌బస్టర్ సినిమా అరుంధతి తర్వాత ఈ సినిమాలో నటించారు. మంచు మనోజ్ తన కెరీర్‌లో ఉత్తమ నటన అందించిన చిత్రాల్లో ఇదీ ఒకటి.

 

Scroll to load tweet…

 

వేదం చిత్రంలో ఎందుకు నటించావు అని అడిగారు 

వేదం చిత్ర ఆడియో లాంచ్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.  "ఆర్య 2, వరుడు, బద్రినాథ్ వంటి పెద్ద సినిమాల తర్వాత వేదం ఎందుకు చేశావని చాలామంది నన్ను అడిగారు. ఇది హీరోగా హీరోగా కెరీర్ ఎఫెక్ట్ అవుతుందని, వెనకడుగు వేసినట్లు అవుతుందని చెప్పారు. కానీ నాకు మాత్రం వేదం సినిమా తెలుగు సినిమాను ఒక అడుగు ముందుకు నడిపించింది అనే నమ్మకం ఉంది." అని అన్నారు. 

వేదం సినిమా కథలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్‌ పాయి లాంటి నటీనటుల పాత్రలు చివర్లో ఒక ఆసుపత్రిలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో కలిసిపోతాయి. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.