ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లోనే అతడు క్రేజీగా బిహేవ్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

వరల్డ్ క్లాస్ ప్లేయర్లు 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టి20 లీగ్ లలో ఐపీఎల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఐపీఎల్ కి ఇండియాలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ లో అత్యంత బలమైన ప్రాంఛైజీలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒకటి. గతంలో ఈ జట్టు తరపున వరల్డ్ క్లాస్ టి20 ప్లేయర్స్ క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ లాంటి వారు ప్రాతినిధ్యం వహించారు. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

నెరవేరిన 18 ఏళ్ళ కల 

ఇంతటి బలమైన ఆటగాళ్లు ఆ జట్టు తరపున ఆడారు.. ఆడుతున్నారు. అయినప్పటికీ 18 ఏళ్లుగా ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలవడం అనేది కలగానే మిగులుతూ వచ్చింది. ఐపీఎల్ ప్రారంభం అయిన ప్రతిసారీ ఆర్సీబీ జట్టు ఈసారైనా కప్పు గెలుస్తుందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోలింగ్ మొదలవుతాయి. కానీ ఈసారి మాత్రం ఆర్సీబీ జట్టు పట్టు వదల్లేదు. 18 ఏళ్ళ కలని సాకారం చేసుకుంటూ ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. ఫైనల్ లో విజయం సాధించిన తర్వాత కోహ్లీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

అల్లు అర్జున్ కొడుకు అయాన్ క్రేజీ సెలెబ్రేషన్స్ 

ఇక దేశవ్యాప్తంగా కోహ్లీ, ఆర్సీబీ అభిమానులు అయితే రచ్చ రచ్చ చేశారు. రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు. బాణాసంచా కాలుస్తూ సంతోషాన్ని తెలియజేశారు. కోహ్లీని అభిమానించే సెలెబ్రిటీ కుటుంబాలు కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ చాలా ఎమోషనల్ గా, క్రేజీగా ఆర్సీబీ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత అల్లు అయాన్ ఇంట్లో ఎలా బిహేవ్ చేశాడో చూపిస్తూ అల్లు అర్జున్ ఓ వీడియో పోస్ట్ చేశారు. 

టీవీ ముందే తలస్నానం 

ఈ వీడియోలో అల్లు అయాన్ చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు. ఆర్సీబీ విజయం సాధించగానే అయాన్ ఇంట్లో నేలపై పడుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత సంతోషంతో టీవీ ముందే బాటిల్ లో ఉన్న నీళ్ళని తలపై పోసుకున్నాడు. ఈ వీడియోలో అల్లు అర్జున్, అయాన్ తండ్రీకొడుకుల సంభాషణ కూడా చూడొచ్చు. నాకు కోహ్లీ అంటే ఇష్టం. కోహ్లీ వల్లే క్రికెట్ పై అభిమానం ఏర్పడింది అని అల్లు అయాన్ అంటున్నాడు. నీ ముఖం వెలిగిపోతోంది అంటూ బన్నీ.. అయాన్ బుగ్గలని ప్రేమగా గిల్లడం చూడొచ్చు. 

View post on Instagram

అల్లు అర్జున్ రియాక్షన్ 

తన కొడుకు క్రేజీగా బిహేవ్ చేయడం చూసి అల్లు అర్జున్ నవ్వుకుంటున్నారు. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో AA 22 అనే చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీగా 800 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది.