సారాంశం

‘పుష్ప 2: ది రూల్’ ఘనవిజయం సాధించిన తర్వాత జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రంగం సిద్ధమైంది.

‘పుష్ప 2: ది రూల్’ ఘనవిజయం సాధించిన తర్వాత జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రంగం సిద్ధమైంది. తాత్కాలికంగా ‘AA22 x A6’గా పేరు పెట్టిన ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా సరికొత్త మేకోవర్ కి రెడీ అవుతున్నాడు. దీనికోసం బన్నీ ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ ప్రారంభించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ సెలెబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో శారీరకంగా పూర్తిగా మారబోతున్నాడు. లాయిడ్ స్టీవెన్స్ ఇప్పటికే ‘RRR’లో ఎన్టీఆర్‌కి శిక్షణ ఇచ్చి ప్రసిద్ధి పొందాడు.

ఒక సమాచారం ప్రకారం, ‘‘ఈసారి ఆయన రగ్గడ్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తూ  అట్లీ సృష్టిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండే కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నారు. ఇది అల్లు అర్జున్‌కు పూర్తిగా భిన్నమైన అవతార్ అని తెలుస్తోంది.

కేవలం శరీర దారుఢ్యంతో కాకుండా, తన స్క్రీన్ ప్రెజెన్స్‌ను పెంచేలా అర్జున్ పనిచేస్తున్నాడని సమాచారం. ‘‘ఈ సినిమా పాత్రలో యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అందుకే బన్నీ మానసికంగా, శారీరకంగా సమగ్రంగా తయారవుతున్నాడు. ఇప్పటికే లుక్ టెస్టులు మొదలయ్యాయి,’’ అని సమాచారం తెలిపింది.

ఈ చిత్రంపై అల్లు అర్జున్ సృజనాత్మకంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. ‘‘అట్లీ విజన్ చాలా భారీ స్థాయిలో ఉంది. అందుకు తగ్గట్లుగా అల్లు అర్జున్ కష్టపడుతూ డెడికేషన్ ప్రదర్శించే నటుడు,’’ అని బన్నీకి దగ్గరగా ఉన్న వర్గాలు పేర్కొన్నాయి.

ఒక వైపు అల్లు అర్జున్ పుష్ప 2 తో భారీ విజయం అందుకున్నాడు. మరోవైపు అట్లీ జవాన్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.