మహేష్ నాకంటే ఏం గొప్ప? అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

allu arjun mahesh war for summer release date
Highlights

  • గత కొంతకాలంగా రిలీజ్ డేట్ పై ఇద్దరు బడా హీరోల వార్
  • మహేష్ భరత్ అనే నేను, బన్నీ నా పేరు సూర్య సినిమాల వార్
  • ఈ నేపథ్యంలో మహేష్ పై తాజాగా అల్లు అర్జున్ డబుల్ హాట్ కామెంట్స్

ఇద్దరు బడా హీరోలు బాక్సాఫీస్ వద్ద తలపడితే కలెక్షన్స్ రేంజ్ లో ఎంత తేడా వస్తుందో తెలిసిందే. ఇప్పటికే సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి  పండగల వార్ కొనసాగుుతుండగా తాజాగా సమ్మర్ వార్ లో తెలుగు ఇండస్ట్రీలో మరో రెండు పెద్ద సినిమాలు క్లాష్ అవుతుండటంతో పంచాయితీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.

 

విడుదల ఒకే రోజు పెట్టుకుని ఢీకొనే అవకాశం ఉన్న ‘భరత్ అను నేను’, ‘నా పేరు సూర్య’ సినిమాల మధ్య పోటీని నివారించడానికి కొంతమంది పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కనీసం ఒక వారం తేడాతో ఈ సినిమాలు విడుదల అయ్యేలా చూడటానికి వారు ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతానికి అయితే పోటీ నుంచి ఎవరో ఒకరు తప్పుకునేలా , ఒక వారం గ్యాప్ తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో కొన్ని హాట్ కామెంట్స్ పడ్డాయనే వార్తలు వస్తూ ఉన్నాయి.మహేశ్ సినిమాకు దారి వదిలి, తమ సినిమా విడుదలను ఒక వారం వాయిదా వేసుకోవాలన్న ప్రతిపాదన విషయంలో అల్లు అర్జున్ ఫైర్ అయ్యాడని టాక్. మహేశ్ సినిమా కోసం తాము వాయిదా వేసుకోవడం కాదు, తమ సినిమా కోసమే మహేశ్ టీమ్ విడుదలను వాయిదా వేసుకోవాలన్నట్టుగా అల్లు అర్జున్ వాదించినట్టు టాక్. ఈ సందర్భంగా అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేసినట్టుగా ఇండస్ట్రీలో ఒక పుకారు షికారు చేస్తోంది.
 

‘మహేశ్ బాబు నా కన్నా ఏం గొప్ప? నేను మహేశ్ తో సమానమైన స్టార్ హీరోనే కదా.. అలాంటప్పుడు నా సినిమానే ఎందుకు వాయిదా వేసుకోవాలి..? నా సినిమా కోసం మహేశ్ సినిమానే వాయిదా వేసుకొమ్మని చెప్పండి..’ అని మధ్యవర్తుల దగ్గర అల్లు అర్జున్ ఫైర్ అయినట్టుగా టాక్. అయితే.. ఈ రెండు సినిమాలూ ఢీ కొట్టే పరిస్థితిని మధ్యవర్తులు నివారించినట్టుగానే తెలుస్తోంది. చివరకు మహేశ్ సినిమా ముందు, అల్లు అర్జున్ సినిమా వెనుక వచ్చేలా ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి చివరికి ఏం జరుగుతుందో ఏమో. మళ్లీ తేడా జరిగితే రోబో తప్పుకున్న అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకువటంలో ఇద్దరూ విఫలమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.

 

loader