అల్లు అర్జున్ కు బాలీవుడ్ లేడీ కొరియోగ్రఫర్

First Published 2, Dec 2017, 2:34 PM IST
allu arjun getting bollywood choreographer for na peru surya
Highlights
  • అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నాపేరు సూర్య చిత్రం
  • నా ఇల్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న చిత్రం
  • ఈ మూవీలో అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్

తెలుగు ఇండస్ట్రీలో వున్న బెస్ట్ డాన్సర్స్ లో ముందున్నది ఎవరా అంటే టక్కున చెప్పగల పేరు బన్నీ.. అల్లు అర్జున్ డాన్స్ కు ఎన్టీఆర్ కూడా ఫిదా అయ్యానని చెప్పాడంటే... బన్నీ ఎలాంటి డాన్సరో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బన్నీ డాన్సులపై అతని ఫ్యాన్స్ పడి చస్తారంతే. బన్నీతో స్టెప్స్ వేయించేందుకు తన అప్‌కమింగ్ సినిమా కోసం ఓ బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్‌ని రంగంలోకి దింపుతున్నారట.

 

ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న “నా పేరు సూర్య” సినిమాలో ఓ స్పెషల్ నెంబర్‌కి స్టెప్స్ కంపోజ్ చేసేందుకు బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్‌ని టాలీవుడ్‌కి రప్పించినట్టు సమాచారం.

 

కథా రచయిత వక్కంతం వంశీని డైరెక్టర్ గా పరిచయం చేస్తోన్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు.ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన హిరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ నటిస్తోంది.

loader