ఏ ఇండియన్ సినిమాకు దక్కని రికార్డ్ 'సరైనోడు' సొంతం!

First Published 16, Jul 2018, 6:55 PM IST
Allu Arjun Gets all india Record with Sarrainodu Hindi Version
Highlights

భారతీయ చిత్రాల్లో ఇటువంటి ఘనత సాధించిన తొలి సినిమా 'సరైనోడు' కావడం విశేషం. హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది

భారతీయ సినిమా చరిత్రలో ఓ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది 'సరైనోడు' సినిమా. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాపంథాగా ఈ సినిమా రూ.127 కోట్లు వసూలు చేసిన బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించిన ఇందులో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. యూట్యూబ్ లో  రెండు కోట్ల మంది ఈ సినిమాను వీక్షించడం విశేషం.

భారతీయ చిత్రాల్లో ఇటువంటి ఘనత సాధించిన తొలి సినిమా 'సరైనోడు' కావడం విశేషం. హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే రెండు కోట్ల వ్యూస్ క్రాస్ చేసిన ఈ సినిమాకు ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 

loader