Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ కు అక్కడ ఇలా జరగటం ఏంటో ఏంటస్య ఏంటోభ్యః

  • మాలీవుడ్ లో రిలీజైన అల్లు అర్జున్ డీజే
  • ఓపెనింగ్స్ కూడా రాలేదని టాక్
  • సడెన్ గా గ్రాఫ్ పడిపోవడంపై స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన
allu arjun dj duvvada jagannadham went flop in mollywood

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కు మలయాళీల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మాలీవుడ్ లో అల్లు అర్జున్ ను ప్రేక్షకులు మల్లుఅర్జున్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. దీనికితోడు మలయాళ యూత్ లో బన్నీ డాన్స్ లు అంటే విపరీతమైన క్రేజ్ వుంది. అందుకే అల్లుఅర్జున్ సినిమాలన్నింటినీ మలయాళ భాషలోకి డబ్ చేస్తున్నారు. మొదట్లో బన్నీ నటించిన ‘బద్రీనాథ్’ ‘ఇద్దరమ్మాయిలతో’ ఫెయిల్ అయినా ఆ తరువాత బన్నీ నటించిన చాల సినిమాలు మాలీవుడ్ లో విడుదలై భారీ విజయాలను నమోదు చేసాయి. 

 

దీంతో కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘దువ్వాడ జగన్నాథమ్’ మూవీని భారీ అంచనాలతో భారీగా పబ్లిసిటీ చేసి అక్కడ  విడుదల చేసారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ‘దువ్వాడ’ పై మాలీవుడ్ ప్రేక్షకులు షాక్ ఇచ్చే తీర్పు ఇచ్చారు. ఈసినిమా మాలీవుడ్ లో  కనీసం సాధారణ స్థాయి ఓపెనింగ్స్ కూడ రాకపోవడం ఈసినిమాను మలయాళంలోకి డబ్ చేసిన నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు టాక్. మాలీవుడ్ లో కూడ బన్నీ మానియా ఏమాత్రం పనిచేయడం లేదన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి.

 

ఇప్పటికే డీజే కొన్న తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లకు దాదాపు 30 శాతం వరకు నష్టాలు వచ్చాయని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో అల్లు అర్జున్ మార్కెట్ ఇలా దెబ్బతినడం

 షాకింగ్ న్యూసే. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.  ఇక బన్నీ వక్కంతం వంశీతో చేస్తున్న తన లేటెస్ట్ మూవీ కోసం ఏకంగా రెండు నెలలుగా లుక్  మార్చుకోవడానికి చాలా

కష్టపడుతున్నాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios