- Home
- Entertainment
- స్టార్ హీరోతో ఎఫైర్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
స్టార్ హీరోతో ఎఫైర్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పెళ్లికి ముందే గర్భవతి అయిన ఈ హీరోయిన్.. పెళ్లి తరువాత ఎక్కువ కాలం కాపురం నిలుపుకోలేకపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడితో విడాకులు తీసుకున్న ఆమె ప్రస్తుతం ఏం చేస్తుంది? ఇంతకీ ఎవరా హీరోయిన్?

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్
కేరళ నుండి వచ్చి తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈహీరోయిన్, దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ధనుష్ తో ఎఫైర్ ఉన్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రేమలో పడి, పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది బ్యూటీ. గర్భవతిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఆమె మరెవరో కాదు అమలా పాల్.
టాలీవుడ్, కోలీవుడ్ లో పాపులర్..
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అమల పాల్ ఒకరు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ, సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత జీవితం ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా అమల పాల్‌కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోల్లో ఆమె చాలా క్యూట్‌గా కనిపిస్తుండటంతో అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తున్నారు.
దర్శకుడిని ప్రేమించి పెళ్లాడిన తార..
కేరళకు చెందిన అమల పాల్ మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ప్రవేశించింది. తమిళంలో వచ్చిన ‘మైనా’ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ చిత్రంతో వచ్చిన అద్భుతమైన గుర్తింపు ఆమెకు వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చకుంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో ఆమె ప్రేమలో పడటం, ఆ తర్వాత 2014లో వీరిద్దరూ వివాహం చేసుకోవడం తెలిసిందే. ఆ సమయంలో ఈ జంటపై అందరి దృష్టి పడింది.
కానీ, పెళ్లయిన కొద్దికాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కుటుంబ కలహాల కారణంగా 2017లో వారు అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల తర్వాత అమల పాల్ మరింత ధైర్యంగా ముందుకు వెళ్లారు. ముఖ్యంగా ‘ఆడై’ వంటి బోల్డ్ చిత్రంలో నటించి అందరినీ విస్మయానికి గురిచేశారు. ఈ సినిమా సమయంలోనూ, ఆ తర్వాత కూడా ఆమెపై రకరకాల రూమర్లు, వివాదాలు చుట్టుముట్టాయి. కొద్దికాలం పాటు తమిళ పరిశ్రమలో ఆమెకు అవకాశాలు తగ్గినప్పటికీ, ఓటీటీ వేదికలు మరియు మలయాళంలో ‘ఆడుజీవితం’, ‘బోలా’ వంటి విభిన్న చిత్రాలతో తన సత్తా చాటుకున్నారు.
కొద్ది కాలానికే రెండో పెళ్లి..
ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, విడాకులు తరువాత జగత్ దేశాయ్ అనే వ్యక్తిని అమల పాల్ రెండో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొద్ది నెలలకే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. దీంతో ఆమె పెళ్లికి ముందే గర్భవతి అయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్ల నుంచి రకరకాల స్పందనలు వచ్చినప్పటికీ, అమల పాల్ మాత్రం తన భర్తతో సంతోషకరమైన క్షణాలను పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.







