అయ్యో పాపం...బన్నీకి చుక్కలు చూపిస్తున్న నెట్టిజన్లు

First Published 9, Apr 2018, 6:02 PM IST
Allu Arjun Brutally trolled by netizens on naa peru surya dialogues
Highlights
అయ్యో పాపం...బన్నీకి చుక్కలు చూపిస్తున్న నెట్టిజన్లు

 

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' రూపొందుతోన్న విషయం తెలిసిందే. నిన్న బన్ని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని మరో డైలాగును వదిలారు. ఇందులో బన్ని 'సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్‌, వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మ‌నకి.. ఒక్క‌టే ఇండియా' అని డైలాగ్ కొట్టాడు. 

అయితే, కొందరు నెటిజన్లకు ఈ డైలాగు నచ్చడం లేదు. నీవు సౌత్ ఇండియన్ యాక్టర్ అనే బయోను ఇండియన్ యాక్టర్‌గా మార్చుకోగలరు. అలా చేస్తే చాలా బాగుంటుంది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇలా చాలా మంది తమకు తోచిన విధంగా పలు రకాలుగా కామెంట్లతో అదరగొట్టారు.నీవు చెప్పే డైలాగ్స్‌ను ముందు నీవు ఆచరించాలి. యాక్టర్‌గా నీ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తాం. ట్విట్టర్ బయోలో సౌత్ ఇండియన్ యాక్టర్ ఉంది. ఓ సారి జాగ్రత్తగా చూసుకో అని ఓ నెటిజన్ అన్నారు.

ఇదిలా ఉండగా, నా పేరు సూర్య సినిమా టీజర్లు, ఫస్ట్‌లుక్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకొన్నది. వక్కంత వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మిలటరీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం మే 4 రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

loader