నా బేబీ బ్రదర్ కు హ్యాపీ బర్త్ డే!

allu arjun birthday wishes to allu sirish
Highlights

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ 

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ప్రముఖులు,మెగాభిమానులు  శిరీష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారందిలో అల్లు అర్జున్ విషెస్ మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. తన తమ్ముడిని ఓ కొడుకులా భావించి ఎమోషనల్ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.

నా మెమొరీస్, సీక్రెట్స్ షేర్ చేసుకునే నా బేబీ బ్రదర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ శిరీష్ తో కేక్ కట్ చేయిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్ ద్వారా తమ్ముడిపై తనకు ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతోంది. ఇక అల్లు శిరీష్ నటుడిగా తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. 'శ్రీరస్తు శుభమస్తు','ఒక్క క్షణం' వంటి చిత్రాలతో తన టాలెంట్ నిరూపించుకున్నాడు.మలయాళంలో మోహన్ లాల్ కలిసి పని చేసిన శిరీష్ కు ఇప్పుడు సూర్య, మోహన్ లాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న సినిమాలో కలిసి పనిచేసే ఛాన్స్ లభించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 
 
 

loader