అమెరికాలోని షికాగోలో నాటా ఉత్సవాలు నాటా ఉత్సవాల్లో గెస్ట్ గా హాజరైన అల్లు అర్జున్ 20 నిమిషాలే ఉండి తెలుగు వారితో అంటీ ముట్టనట్టు వ్యవహరించాడని గుసగుసలు
అమెరికాలో నివసించే తెలుగు ఎన్నారైలు సంఘాలుగా.. నిర్వహించే సంస్థల ఫంక్షన్స్ కు అతిథులుగా వెళ్ళడం అక్కడ ఆ ఫంక్షన్స్ లో మాట్లాడి తమ ఇమేజ్ ని మరింత పెంచుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రెండ్. తానా ఆటా లాంటి తెలుగువారి సంస్థలు చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్, పవన్ లాంటి టాప్ హీరోలతో పాటు రామ్ చరణ్, కళ్యాణ్ రామ్ లాంటి యంగ్ హీరోలను కూడ గతంలో తమ ఫంక్షన్స్ కు అతిధులుగా పిలిచారు.
ఈమధ్య అమెరికాలోని తెలుగువారు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి అతిధిగా వెళ్ళిన వెంకటేష్ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చి అమెరికాలోని తెలుగువారి మన్నలనను పొందాడు. అదేవిధంగా గతంలో అభిమానులను కూడా చిరాకు లేస్తే ఒంటికాలిపై లేచి ఆగ్రహించే బాలకృష్ణ కూడ అమెరికాలోని తెలుగు సంస్థల సభ్యులతో ఎంతో అభిమానంగా సన్నిహితంగా మెలిగి అందరి మన్ననలను పొందాడు.
అయితే అల్లుఅర్జున్ మాత్రం అమెరికాలోని షికాగోలో నాటా ఉత్సవాలలో తన స్పీచ్ ద్వారా కానీ లేక తన ప్రవర్తన వల్ల కానీ అమెరికాలోని తెలుగువారి ప్రశంసలు పొందలేకపోయాడని ప్రచారం జరుగుతోంది. నాటా ఉత్సవాలకు అతిధిగా వెళ్ళిన అల్లుఅర్జున్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉండి అందరికి షాక్ ఇచ్చాడన్న వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు ఆ ఉత్సవాలకు వచ్చిన అనేక మంది ప్రతినిధులతో అల్లుఅర్జున్ అంటీముట్టనట్లుగా బన్నీ కనపరిచిన యాటిట్యూడ్ చాలా మందిని విస్మయానికి గురిచేసిందట. ముఖ్యంగా నాటా సంస్థ గురించి కానీ అమెరికాలోని తెలుగువారి కృషి గురించి కానీ ఏమి మాట్లాడకుండా... కేవలం ‘డిజే’ మూవీ గురించి దానిపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి బన్నీ మాట్లాడటంతో ఇది నాట్స్ సంస్థ ఉత్సవమా ? లేదంటే ‘దువ్వాడ జగన్నాథమ్’ ప్రమోషన్ ఫంక్షన్ అనుకోవాలా.. అంటూ నాట్స్ సంస్థ ఉత్సవాలకు ప్రతినిధులుగా వచ్చిన చాలామంది తమలో తాము గుసగుసలాడుకున్నట్లు టాక్.
