యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో కూడా హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అలాగే క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు
‘ఈలోకం మీకు తుపాకి ఇచ్చింది. నాకు గొడ్డలి ఇచ్చింది. ఎవడి యుద్ధం వాడిదే’ అంటున్నాడు పుష్పరాజ్. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ...’ అంటూ అంటున్నాడు పుష్ప. మరి అతని కథేమిటో తెలియాలంటే ‘పుష్ప’ చిత్రం చూడాల్సిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రమిది. రష్మిక హీరోయిన్. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తోంది. సుకుమార్ దర్శకుడు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది.
మన దేశంలోనే ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండటమే కాకుండా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ లెవల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో కూడా హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అలాగే క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.డిసెంబర్ 16 నుంచే ప్రీమియర్స్ తో ఈ చిత్రం అక్కడ రచ్చ స్టార్ట్ చేయనుంది.
అయితే ఫైనల్ కాపీ ఇంకా రెడీ లేదని, దాదాపు రేపు హార్డ్ డిస్క్ పంపే ప్లాన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది జరగని పక్షంలో యూఎస్ ప్రీమియర్ క్యాన్సిల్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఈ వార్త బన్నీ అభిమానులతో పాటు, “పుష్ప” కోసం ఎదురుచూస్తోన్న సినీ ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరుస్తోంది. అయితే యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం “అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇచ్చిన షెడ్యూల్స్ ప్రకారం ప్రీమియర్ షోలు పడనున్నాయని” అన్నారు.
Also read Pushpa:హిందీ ‘పుష్ప’ ఓపెనింగ్స్ దారుణం?
ఇదిలా ఉండగా..యుఎస్ మార్కెట్ లో “స్పైడర్ మ్యాన్” రూపంలో “పుష్ప”కు భారీ ఎదురుదెబ్బే తగలుతోంది. ప్రీమియర్ షోలు ఎక్కువగాప్రదర్శించేందుకు లేకుండా స్క్రీన్స్ కొరత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ‘స్పైడర్ మ్యాన్’ సినిమా లేకుంటే ‘పుష్ప’ షోల సంఖ్య ఖచ్చితంగా రెట్టింపు అయ్యి ఉండేవి. కాకపోతే ఓ పెద్ద పాజిటివ్ విషయం ఏమిటంటే... షో ఓపెన్ చేస్తే అక్కడ హౌస్ ఫుల్ బోర్డు పెట్టేస్తున్నారు. దాంతో ఓవర్ సీస్ లో ‘పుష్ప రాజ్’ క్రేజ్ ఏంటో అంచనా వేయచ్చు.
