ఒకప్పుడు కామెడీ సినిమాలతో  దూసుకుపోయిన హీరో అల్లరి నరేష్. కానీ తన కెరీర్ ప్రస్తుతం నెమ్మదించింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో సందడి చేసే అల్లరి నరేష్ ఇప్పుడు బాగా వెనుకబడిపోయాడు. అందుకు కారణం ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ కు సరైన విజయాలు లేకపోవడమే. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో అల్లర నరేష్ వెల్లడించిన వింత కోరికకు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆరంభంలో అల్లరి నరేష్ వరుస విజయాలతో దూసుకునిపోయాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తూ థియేటర్ లలో రచ్చ చేసేవాడు. సరైన విజయాలు దక్కకపోవడంతో అల్లరి నరేష్ కెరీర్ బాగా డల్ అయింది.తనకు చిన్న నాటి నుంచి రఘువరన్ నటన అనే పిచ్చి అని అల్లరి నరేష్ తెలిపాడు. శివ సినిమాలో ఆయన నటన చూసి ఆశ్చర్యపోయా అని నరేష్ తెలిపాడు.రఘువరన్ కనుక అమ్మాయి అయి ఉంటె ఆయన్నే పెళ్లి చేసుకుని ఉండేవాడినని, ఆయన అంటే అంత అభిమానం అని నరేష్ తెలిపాడు.