బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బరువు పెరిగిందంటూ కత్రినా కైఫ్‌పై వస్తున్న ట్రోల్స్‌కు అలియా భట్ చెక్ పెట్టింది. కొత్త తల్లిపై తనదైన స్టైల్‌లో ప్రేమను కురిపించింది. ఆ వివరాలు మీకోసం!

కత్రినా కైఫ్ అంటేనే అందం, అభినయం. తనదైన స్టైల్, మాట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తన లైఫ్‌లో బెస్ట్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఒకవైపు ఆమె బ్యూటీ బ్రాండ్ 'కే బ్యూటీ' (Kay Beauty) రూ.400 కోట్ల భారీ సక్సెస్ సాధించింది. మరోవైపు భర్త విక్కీ కౌశల్‌తో కలిసి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి డబుల్ ఖుషీలో ఉంది.

కత్రినాపై ట్రోలింగ్!

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కత్రినా కాస్త బరువు పెరిగింది. దీనిపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నెగెటివ్ కామెంట్స్‌పై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చే జరిగింది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదంటూ చాలా మంది మండిపడ్డారు. సల్మాన్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు కత్రినాకు అండగా నిలిచారు.

లండన్‌లో 'కే బ్యూటీ' ఈవెంట్

తన బ్రాండ్ 'కే బ్యూటీ' సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు కత్రినా లండన్‌లో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. రియా కపూర్ స్టైలింగ్‌లో ఎర్తీ టోన్స్ డ్రెస్‌లో కత్రినా మెరిసిపోయింది. న్యాచురల్ లాంగ్ హెయిర్, లైట్ లిప్‌స్టిక్‌తో ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంది. లండన్‌కు చెందిన చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ చిన్ననాటి క్రష్‌తో రీల్స్ చేశారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఈవెంట్ ఫోటోలు బయటకు రాగానే, అభిమానులు ఆమె అందానికి ఫిదా అయ్యారు. ఇదే సమయంలో అలియా భట్ కూడా కత్రినాకు సపోర్ట్‌గా నిలిచింది. రియా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కత్రినా లేటెస్ట్ ఫోటోల కింద అలియా ఫైర్ ఎమోజీలను కామెంట్ చేసింది.

ఆ పోస్ట్ మీరే చూడండి!

View post on Instagram
 

వర్క్ ఫ్రంట్..

సినిమాల విషయానికొస్తే.. అలియా భట్, ప్రియాంక చోప్రాతో కలిసి కత్రినా 'జీ లే జరా' సినిమాలో నటించనుంది. అలాగే ఆమె చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.