అఖిల్ "హలో" మూవీ పోస్టర్ లీకేజీ వెనుక లవ్ స్టోరీ

akkineni akhil vikram kumar movie poster leakage story
Highlights

  • ఇటీవలే లీకైన అఖిల్ విక్రమ్ కుమార్ మూవీ పోస్టర్
  • పోస్టర్ లీకేజీపై క్లారిటీ ఇచ్చిన విక్రమ్ కుమార్
  • పోస్టర్ డిజైన్ చేసిన తన ఫ్రెండ్ ప్రేమతో అతని గర్ల్ ఫ్రెండ్ కు షేర్ చేస్తే..
  • ఆమె లీక్ చేసేయటం.. అది అంతటా లీకై వైరల్ అయిపోవడం జరిగిందట

అక్కినేని అఖిల్ రెండవ సినిమాగా వస్తున్న హలో సినిమా నుండి ఫస్ట్ లుక్ పొస్టర్ రిలీజ్ అవకుండానే సినిమాలోని ఓ క్రేజీ పోస్టర్ లీక్ అయ్యింది. అయితే చాలామంది ఆ లుక్ కావాలనే పబ్లిసిటీ స్టంట్ కింద రిలీజ్ చేశారని అన్నారు. కాని దానికి కింగ్ నాగార్జున వివరణ ఇస్తూ లీక్ చేసి పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి లేదని ఆ పోస్టర్ ఎలా లీక్ అయ్యిందో చెప్పాడు.

 

డైరక్టర్ విక్రం కుమార్ పోస్టర్ డిజైన్లు అన్ని హాంకాంగ్ లో తన ఫ్రెండ్ చేస్తాడట. మనం సినిమాకు అతనే చేశాడట. అయితే అఖిల్ పోస్టర్ డిజైన్ విషయంలో తన ఫ్రెండ్ కు షేర్ చేయగా ఆ పోస్టర్ అతను తన గాళ్ ఫ్రెండ్ కు షేర్ చేశాడట. అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చిందని చెప్పాడు నాగార్జున.

 

యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న అఖిల్ హలో మూవీ దాదాపు 40 కోట్ల పైన భారీ బడ్జెట్ తో రాబోతుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా కళ్యాణి ప్రియదర్శిని నటిస్తుందని తెలుస్తుంది. ఇక సినిమాలో అఖిల్ యాక్షన్ సీన్స్ లో అదరగొడతాడని తెలుస్తుంది.

 

హీరోగా మొదటి సినిమా అఖిల్ దెబ్బ కొట్టడంతో ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టేందుకు నాగార్జున జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. డిసెంబర్ 22న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా అఖిల్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నాడు హలో నిర్మాత నాగార్జున.

 

మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM

loader