అత్యంత సన్నిహితులకు మాత్రమే అక్కినేని వారి ఆతిధ్యం ఆహ్వానం పంపింది కేవలం అతి దగ్గరి బంధుమిత్రులకే

కొందరు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని... జి.వి.కె. కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అఖిల్‌, శ్రియా భూపాల్‌ ఎంగేజ్‌మెంట్‌ డిసెంబర్‌ 9న జరగనుంది.

ఈ ఎంగేజ్‌మెంట్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అక్కినేని కుటుంబ వేడుకగా జరపబోతున్నారు. వివాహం తర్వాత జరిగే రిసెప్షన్‌ను గ్రాండ్‌ లెవల్‌లో చేసేందుకు అక్కినేని ఫ్యామిలీ ప్లాన్‌ చేస్తోంది. రిసెప్షన్‌కు అందదరినీ ఆహ్వానించబోతున్నట్లు అక్కినేని కుటుంబ సభ్యులు తెలియజేశారు.