Asianet News TeluguAsianet News Telugu

హలో టీజర్ యూ ట్యూబులోంచి గయాబ్.. అఖిల్ కు ఇదేం షాక్..

  • అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన హలో
  • డిసెంబర్ 22న హలో మూవీ రిలీజ్ కోసం ప్లాన్ చేసిన టీమ్
  • తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ను కాపీరైట్ కారణంగా తొలగించిన యూట్యూబ్
akhil teaser removed from youtube

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నటించిన 'హలో' మూవీ వచ్చే నెల 22న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్న వేళ ఊహించని షాక్ తగిలింది. ఆ మధ్య విడుదలైన 'హలో' టీజర్‌ను యూట్యూబ్ తొలగించింది. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున నిర్మిస్తుండటంతో అన్నపూర్ణ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్‌లో దీన్ని అప్ లోడ్ చేశారు. ఈ టీజర్‌కు మిలియన్స్‌లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వచ్చాయి. అయితే ఉన్నట్టుండి టీజర్ యూట్యూబ్ నుండి మాయం కావడంతో అభిమానులు షాకవుతున్నారు.

 

ఈ టీజర్ తొలగించడానికి కారణం ఇందులో వాడిన మ్యూజిక్ అని తెలుస్తోంది. అది కాపీ రైట్ ఉన్న మ్యూజిక్ కావడం, దాని వినియోగ హక్కులు పొందకుండా టీజర్లో వాడేయటంతో పసిగట్టిన యూట్యూబ్ దాన్ని తొలగించింది. ఆ మ్యూజిక్ సొంత హక్కు దారులు వారే ఫిన్‌లాండ్‌కి చెందిన ఎపిక్ నార్త్ కంపెనీ టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారు చేస్తుంది. ఎంతో క్వాలిటీగా ఉండే ఆ మ్యూజిక్‌ని చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ టీజర్‌కి వాడాడట. దీంతో కాపీరైట్ క్లైమ్ కావడంతో హలో టీజర్‌ని యూట్యూబ్ నుండి తీసేశారు.

 

విషయం తెలిసిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ వారు చర్యలు చేపట్టారు. కాపీ రైట్ ఉన్న ఆ మ్యూజిక్ హక్కులు కొని... తిరిగి టీజర్ అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ‘హలో' చిత్ర యూనిట్‌కు ఇది ఊహించని చేదు అనుభవమే. సినిమా విడుదల ముందే ఇలా జరగడంతో నాగార్జున కూడా అసంతృప్తికి గురైనట్లు సమాచారం. అఖిల్ నటించిన తొలి సినిమా ప్లాప్ కావడంతో నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారు. చిత్ర నిర్మాణ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

 

‘మనం' సినిమాతో నాగార్జున ఫ్యామిలీకి మంచి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 22న ‘హలో' మూవీ విడుదల కాబోతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios