అఖిల్ అక్కినేని హీరోగా వస్తోన్న హలో మూవీ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హలో ఫస్ట్ లుక్ పోస్టర్ కు గుడ్ రెస్పాన్స్, మళ్లీ లీకైన మరో పోస్టర్  

 అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి హలో టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన టీమ్ కు అభినందనల వెల్లువ లభించింది. అయితే.. దానికన్నా ముందు ఓ పోస్టర్ లీకై బజ్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు అదే తరహాలో మరో పోస్టర్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అఖిల్ ఓల్డ్ సిటీలోని ఓ గళ్లీలో బ్యారెల్ బాక్స్ లను ఎగిరి తంతూ.. అదికూడా గోడపైన అడ్డంగా పరిగెడుతూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ఇప్పటికే లీకై అంతటా చక్కర్లు కొడుతోంది. అయితే కొంత సీజీ వర్క్ లో లోపాలుండటం వర్క్ మధ్యలో వుండగానే లీకైనట్లు స్పష్టం చేస్తోంది. మరి ఎలా లీకైందో.. తెలియదుకానీ.. హలో మూవీపై ఈ లీకేజీ పోస్టర్లు భలే క్రేజ్ క్రియేట్ చేస్తున్నాయి.