Asianet News TeluguAsianet News Telugu

ఆ పిచ్చి వుందని బెండకాయ తిన్నా-అఖిల్

హలో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న అఖిల్

హలో మూవీ విశేషలాతోపాటు పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్న అఖిల్

తన పిచ్చి కారణంగా అమ్మ అబద్ధం చెప్పి బెండకాయ తినిపించిందన్న అఖిల్

 

akhil interview about hello and other things

అక్కినేని అఖిల్ తొలి సినిమా పరాజయం నుండి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానంటున్నాడు. త్వరలో 'హలో' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమ్మా నాన్న కలిసి నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ ‘శివ' తొలిసారి చూసినపుడు తనకు నచ్చలేదని, అపుడు చిన్నపిల్లాన్ని కావడం వల్ల అర్థమే కాలేదని, ఆ సినిమాను ఇప్పటికీ 22 సార్లు చూశాను. 16వ సారి చూసినపుడు సినిమా నచ్చింది అని అఖిల్ అన్నాడు.

 

ఫస్ట్ సినిమా అఖిల్ ఫ్లాపవ్వడం మంచిదే అయిందని అంటున్నాడు.. “ఆ సినిమా హిట్టయితే.. అవే తరహా కథలు చేసేవాడ్నేమో. నా తప్పులు అర్థమయ్యేవి కావు. అందరూ చేసే రొటీన్ కథలు వీడు చేస్తున్నాడనే కామెంట్స్ రావడంతో కాస్త కుంగిపోయాను. అయితే ‘అఖిల్' ఫెయిల్ అవ్వడం వల్లే ‘హలో' లాంటి కొత్త తరహా కథల వైపు దృష్టి పెట్టాను అని తెలిపారు.

 

అఖిల్ ఫ్లాప్ తర్వాత లెక్కలేనన్ని కథలు విన్నాను. కాస్త గ్యాప్ వచ్చినా సరే గర్వపడే సినిమానే చేయాలనుకొన్నా. పర్సనల్ గా కూడా ఆ కథ నాకు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాను. అలాంటి కథ విక్రమ్‌ కె కుమార్‌ వినిపించారు. ‘హలో' నా జీవితాన్ని మార్చే సినిమా అవుతుంది అని అఖిల్ తెలిపారు.

 

నాన్న ముఫ్ఫై ఏళ్ల అనుభవం ‘హలో'కి బాగా పనికొచ్చింది. ఆయన సపోర్టుగా ఉండటం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ‘నువ్వూ ఇవన్నీ చూసుకోవాలి. లేకపోతే సెట్లో ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు' అంటూ నాకూ కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈ అనుభవాలన్నీ భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడతాయి అని అఖిల్ తెలిపారు.

 

నాకు స్పోర్ట్స్‌ అంటే ఇష్టం. అందులో క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అండర్‌ 17 వరకూ జాతీయ జట్టులో ఆడాలనుకునేవాణ్ని. క్రికెట్‌ అంటే ఎంత పిచ్చి అంటే కొన్నిసార్లు వ్యక్తిగతంగా తీసుకొంటుంటా. నాకు, నాన్నకి సచిన్‌, విరాట్‌ కోహ్లిలంటే ఇష్టం. నేను మాంసం ఎక్కువ తింటుండటంతో సచిన్‌ బెండకాయ తింటాడని అబద్దం చెప్పి అమ్మ నాతో నాతో బెండకాయ తినిపించింది. సచిన్‌ అంటే అంత పిచ్చి నాకు. నేను ఇప్పటిదాకా చదివిన ఒకే ఒక పుస్తకం... సచిన్‌ ఆటోబయోగ్రఫీ అని అఖిల్ తెలిపారు.

 

నాకు చిరంజీవి డాన్స్‌ అంటే పిచ్చి. ‘అమ్మడు కుమ్ముడూ' పాటని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. ఆ లక్షణాలే రామ్‌చరణ్‌కి వచ్చాయి. ఇక ఎన్టీఆర్‌ డాన్స్‌ గురించి చెప్పేదేముంది? తనని పట్టుకోవడం చాలా కష్టం. నాకు డాన్స్ చేయడం పెద్దగా రాదు. అథ్లెట్ బాడీ కాబట్టి బాడీ ఎలా అంటే అలా బెండ్ అవుతుంది. అలా ఏదో మేనేజ్ చేస్తున్నాను అని అఖిల్ తెలిపారు.

 

‘నా బాల్యం చాలా సరదాగా గడిచిపోయింది. అప్పుడప్పుడు స్కూల్‌కి బంక్‌ కొట్టడం, రాత్రిళ్లలో స్నేహితులతో కలిసి కార్‌ తీసుకొని బయటికి వెళ్లిపోవడం లాంటివి చేసేవాన్ని, నేను చేస్తున్న పనులు ఇంట్లో తెలియడంతో క్లాస్ పీకారు. అయినా అప్పుడప్పుడు నాన్నకి తెలియకుండా గోడ దూకి వెళ్లిపోయేవాణ్ని. అవన్నీ గుర్తుకొస్తే సరదాగా అనిపిస్తుంది అని అఖిల్ తెలిపారు.

 

మా తాతయ్యను ఏఎన్నార్‌లా చూసేవాడ్ని కాదు. ఓ తాతలానే ఆడుకునేవాడ్ని. ఆయన గొప్పదనం తెలిసే వయసు నాకు వచ్చే సరికి ఆయన దూరం అయ్యారు. ఆయన ఇపుడు ఉండి ఉంటే ఎన్నో విలువైన పాఠాలు బోధించేవారో అనిపిస్తోంది. తాతయ్య తనకిష్టమైన వృత్తిలో చివరి నిమిషం వరకూ పనిచేయగలిగారు. మంచంపై ఉండి డబ్బింగ్‌ చెప్పారు. జీవితమంటే.. అలా ఉండాలి. కోట్లలో ఒక్కరికే దొరికే జీవితం అది... అని అఖిల్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios