అఖిల్ వర్సెస్ అల్లు శిరీష్, హలో.. ఒక్క క్షణం అంటున్న శిరీష్

akhil hello movie getting competed with allu sirish okka kshanam
Highlights

  • హలో మూవీతో డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న అఖిల్
  • రీ ఎంట్రీ మూవీ అంటూ భారీ హైప్, టీజర్ కు మంచి రెస్పాన్స్
  • మరోవైపు డిసెంబర్ 23న  ఒక్క క్షణం అంటున్న మెగా హీరో అల్లుశిరీష్
  • అఖిల్ సోలోగా హలో అనకుండా ఒక్క క్షణం అంటూ పోటీకొస్తున్న శిరీష్

 

అఖిల్ అక్కినేని రీ ఎంట్రీ మూవీ అంటూ వస్తోన్న హలో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అఖిల్ ఈ మూవీలో అవినాష్ అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక మొదటి సినిమా పరాజయంతో రెండో సినిమాతో ఎలాగైనా హీరోగా సత్తా చాటాలని అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హలో చిత్రంలో రిస్కీ షాట్స్ చేసాడని టీజర్ చూస్తేనే అర్థథమవుతోంది.. ఈ టీజర్ రీసెంట్‌గా విడుదలై మంచి రెస్పాన్స్‌ ని రాబట్టుకుంటోంది.

 

అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమెరబుల్ మూవీని ఇచ్చిన విక్రమ్ కుమార్ హలో చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని నాగార్జున తన డిసెంబర్ సెంటిమెంట్‌ని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక అఖిల్ సినిమా డిసెంబర్‌లో వస్తుందని తెలియడంతో, ఈ సినిమా కోసం చాలా సినిమాలు రిలీజ్‌ని పోస్ట్‌ పోన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

 

ఓ పక్క అఖిల్ సినిమా కోసం సినిమాలు పోస్ట్ పోన్ అవుతుంటే.. మరోపక్క అఖిల్‌తో పోటీ పడేందుకు మెగా హీరో అల్లు శిరీష్ రెడీ అయ్యాడు. ‘ఎక్కడిపోతావు చిన్నవాడా’ చిత్ర దర్శకుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా ‘ఒక్క క్షణం’ అనే చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా విడుదల తేదీని ప్రకటించింది.

 

డిసెంబర్ 22న అఖిల్ ‘హలో’ చిత్రం రిలీజ్ అవుతుంటే, డిసెంబర్ 23న అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ అంటూ రిలీజ్‌కి రెడీ అవడంతో అఖిల్‌కి పోటీగా అల్లు శిరీష్ వస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో అప్పుడే దర్శనమిచ్చేస్తున్నాయి. ఎటువంటి అడ్డులేకుండా సోలో రిలీజ్‌గా రావాలని చూసిన అఖిల్ ‘హలో’కి, ‘ఒక్క క్షణం’ అంటూ అల్లు శిరీష్ పోటీకి దిగుతుండడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పట్లేదు.

loader