అఖిల్ అక్కినేని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా హలో. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యింది. సినిమా టీజర్ చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. అఖిల్ స్టంట్స్ కు సిని ప్రియులంతా నోరెళ్లబెట్టారంటే నమ్మాలి.

 

టీజర్ లోనే ఈ రేంజ్ ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా టీజర్ అఖిల్ కు ఓ కొత్త రికార్డ్ సృష్టించేలా చేసింది. యువ హీరోల్లో అఖిల్ ఈ సినిమా టీజర్ తో అరుదైన రికార్డ్ సాధించాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తక్కువ టైంలో 5 మిలియన్ వ్యూస్ సాధించింది. డిజిటల్ వ్యూస్ అన్నిటిలో అఖిల్ హలో మారుమోగుతుంది. 

 

యూట్యూబ్ లో 40 లక్షల దాకా రాగా మిగిలిన సోషల్ మీడియా మాధ్యమాలతో మరో 10 లక్షలు వచ్చాయట. మొత్తం మీద అఖిల్ హలో 5 మిలియన్ వ్యూయర్స్ తో క్రేజీగా మారింది. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవనుంది. అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్ కాగా ఈ సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. 

 

40 కోట్ల బడ్జెట్ తో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చేసిన ఈ సినిమాతో నాగార్జున అఖిల్ కు ఓ అదిరిపోయే హిట్ ఇస్తాడని తెలుస్తుంది. మరి అఖిల్ కోరుకునే హిట్ హలో ఇస్తుందా లేదా అన్నది చూడాలి.