అఖిల్ హలో తొలి రోజు కలెక్షన్స్ వివరాలు

అఖిల్ హలో తొలి రోజు కలెక్షన్స్ వివరాలు

అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ మొత్తానికి రెండో సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘హలో’ సక్సెస్ అఖిల్ కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ సినిమా విజయాన్ని అఖిల్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు. అంతటా పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూలు  ముఖ్యంగా క్లాస్ ఆడియెన్స్ ‘హలో’కు హలో చెప్తుండటంతో హిట్ టాక్ సొంతం చేసుకుంది. తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నైజాం, ఆంధ్రా వసూళ్లు 4.2కోట్ల గ్రాస్ సాధించగా షేర్ 2.7కోట్లుగా వుంది. 

 

ప్రత్యేకించి ఓవర్సీస్, మల్టీప్లెక్స్ లలో హలో సత్తా చూపిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్లతో మూడు లక్షల డాలర్ల మార్కును దాటేసింది. ఓవర్సీస్ లో ఈ మేరకు వసూళ్లను సాధించింది ‘హలో’. అఖిల్ మొత్తం నాగార్జున పోలీకలు కనిపించడం, డాన్సుల్లో నాగేశ్వర్ రావు పోలికలు కనిపించడం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. దీంతో అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చి టాలీవుడ్ లో సెట్ అయినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


 ఇక యూఎస్ ప్రీమియర్స్ లో అఖిల్ సినిమా సుమారు రెండు లక్షల డాలర్ల వసూళ్లను సాధించింది. ఇక విడుదల అయిన శుక్రవారం రోజున మరో లక్ష డాలర్ల మార్కును అందుకుంది. ఓవరాల్ గా తొలి రోజు ముగిసే సరికి మూడు లక్షల డార్ల వసూళ్లకు రీచ్ అయ్యింది ఈ సినిమా. ప్రీ రిలీజ్ మార్కెట్ లో ఈ సినిమా యూఎస్ వరకూ మూడు కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసింది. అందులో సగం మొత్తం తొలి రోజే రిటర్న్ అయ్యింది. పాజిటివ్ టాక్ ఉండటం, శని, ఆదివారాలకు తోడు సోమవారం కూడా సెలవే కావడంతో.. హలోకు లాభాల పంట ఖాయం అనిపిస్తోంది. మొత్తానికి మరో అక్కినేని హీరో ఇండస్ట్రీలో సెటిలైనట్లే.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page