యూట్యూబ్ వివాదంపై అఖిల్ వివరణ

యూట్యూబ్ వివాదంపై అఖిల్ వివరణ

కొద్ది రోజుల క్రితం విడుదలైన అఖిల్ కొత్త సినిమా టీజర్ కాపీ రైట్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ ట్రాక్ ఓ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బం నుంచి కాపీ చేసిందనే ఆరోపణల నేపథ్యంలో హలో టీజర్‌ని ఆన్‌లైన్‌లోంచి తొలగించారు యూట్యూబ్ నిర్వాహకులు. 

 

అయితే, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, ఆ మ్యూజిక్ ట్రాక్‌పై తమకే సర్వహక్కులు కలిగి వున్నాయని 'హలో' మేకర్స్ నిరూపించుకున్న నేపథ్యంలో తిరిగి హలో టీజర్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. ఇదే విషయమై తాజాగా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు అఖిల్. ఏ తప్పూ చేయకుండా కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదంటూ నిట్టూర్చాడు అఖిల్.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos