అఖిల్ లవర్ తో రాంచరణ్ బావమరిది పెళ్లి

అఖిల్ లవర్ తో రాంచరణ్ బావమరిది పెళ్లి

శ్రియా సోమ్ భూపాల్… ఈమెని గుర్తు పట్టారా? ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు. అఖిల్ ప్రేమించి, పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధపడి, తరవాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయే ఈ శ్రియా భూపాల్. అప్పట్లో అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావడం గురించి రకరకాల కథనాలు వినిపించాయి. అవన్నీ పక్కన పెడితే… ఈ అమ్మాయి జూలై 6న పెళ్లి చేసుకోనుంది. ఏప్రిల్ 20న ఎంగేజ్‌మెంట్‌. పెళ్లికి ముందు పారిస్‌లో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేశారట.

 ఇంతకీ, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నది ఎవరినో తెలుసా? హీరో రామ్‌చ‌ర‌ణ్‌ బావమరిది అనిందిత్ రెడ్డిని. చరణ్ వైఫ్ ఉపాసన పిన్ని సంగీతారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిల కుమారుడే ఇతను. ప్రస్తుతం ఫ్యామిలీకి చెందిన అపోలో హాస్పిటల్స్‌లో ఉద్యోగం చేస్తున్న అనిందిత్ రెడ్డి నేషనల్ లెవల్ రేసింగ్ ఛాంపియన్ కూడా! శ్రియా భూపాల్ పెళ్లికి సిద్ధమయ్యారు. మరి, అఖిల్ ఎప్పుడు చేసుకుంటారో?
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos