Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ ఎంగేజ్ మెంట్ కార్డ్ సందడి..!

గత కొంత కాలంగా అఖిల్, శ్రియా భూపాల్ ప్రేమలో పడ్డారని అంతా టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఆ విషయం పెళ్లి వరకు వచ్చేసింది. అఖిల్, శ్రియా పెళ్లికి సంబంధించిన ఎంగేజ్ మెంట్ కార్డ్ ఇప్పుడు సినీ,పారిశ్రామిక వేత్తల ఇళ్లలోనే కాక.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.

akhil engagement card

అక్కినేని ఫ్యామిలీలో నాగ‌చైత‌న్య‌, స‌మంత త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణ‌యించుకున్న త‌రుణంలో అఖిల్ నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటూ అంద‌రికి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు. ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మ‌న‌వరాలు శ్రేయ భూపాల్ తో ప్రేమ‌లో ప‌డిన విష‌యాన్ని అఖిల్ ఇప్పటికే ప్ర‌క‌టించాడు. అఖిల్, శ్రేయాల‌ ఎంగేజ్ మెంట్ కూడా డిసెంబ‌ర్ 9న జ‌ర‌గ‌నున్న‌ట్టు గ‌తంలో నాగార్జున ప్ర‌క‌టించారు. వీరిద్దరి పెళ్లి క‌న్ ఫ‌ర్మ్ చేసేలా ఇప్పుడు అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్ కార్డ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.akhil engagement card

ఈ కార్డ్ లో డిసెంబ‌ర్ 9న శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల‌కు జి.వి.కె ఇంట్లో ఈ ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు.   శ్రీమ‌తి అన్న‌పూర్ణ‌, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఆశీస్సుల‌తో అంటూ కార్డ్ బిగినింగ్ లో ఉంటే....లాస్ట్ లో అమ‌ల‌, నాగార్జున అక్కినేని అని రాసారు. ఇక అఖిల్ పెళ్లి ఇట‌లీలో ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తంమీద అక్కినేని వారింట చైతన్య కంటే ముందే అఖిల్ పెళ్లి బాజా మోగుతోందన్న మాట.

Follow Us:
Download App:
  • android
  • ios