అఖిల్ చెప్పిన "హలో" టీజర్ సంగతులు

First Published 14, Nov 2017, 3:20 PM IST
akhil akkineni movie poster released teaser on nov16
Highlights
  • అక్కినేని అఖిల్ హీరోగా హలో మూవీ
  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న నాగార్జున
  • అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వస్తున్న హలో కు యమా క్రేజ్

అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖిల్ కొత్త చిత్రం హలో టీజర్‌ పోస్టర్‌ ను ప్రేక్షకుల కోసం ట్విటర్ లో పెట్టేశాడు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో తలకిందులుగా ఎత్తైన బిల్డింగ్‌పై ఉన్న లుక్‌లో కనిపించిన అఖిల్.. తాజా లుక్‌లో ఎత్తైన ప్రదేశం నుండి దూకుతున్నాడు. ఇదే పోస్టర్‌పై ‘హలో’ టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేశారు. నవంబర్ 16న థ్రిల్లింగ్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే ‘హలో’ టీజర్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా రిలీజ్ చేయకముందే సోషల్ మీడియాలో టీజర్ పోస్టర్ లీక్ అయ్యింది. దీంతో చేసేదిలేక మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు అఖిల్.  లీక్ పోస్టర్‌లో అఖిల్ బైక్ రేసర్లుతో పోటీ పడుతూ.. రయ్ మంటూ దూసుకొచ్చే స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ మూవీలో అఖిల్ సరసన దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి నటిస్తుంది. డిసెబర్ 22న క్రిస్మస్ కానుకగా ‘హలో’ మూవీ విడుదల కానుంది.

loader