అఖిల్ అక్కినేనికి ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మ్యారేజ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లికి వేళ అయ్యింది. త్వరలోనే ఆయన మూడు ముళ్ల బంధంతో ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. అఖిల్.. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనబ్‌తో ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది.
అఖిల్ అక్కినేని మ్యారేజ్ డేట్ ఫిక్స్
అఖిల్, జైనబ్‌ల ఎంగేజ్‌మెంట్‌కి ఇండస్ట్రీ నుంచి కొద్ది మంది సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఇప్పుడు పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. తాజాగా అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందట. జూన్ 6న అఖిల్, జైనబ్‌ల మ్యారేజ్ ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అఖిల్.. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, అమలల కుమారుడు అనే విషయం తెలిసిందే.
రహస్యంగా అఖిల్, జైనల్ ప్రేమ వ్యవహారం
అఖిల్, జైనబ్‌లకు ముందుగానే పరిచయం ఉందని, వీరిద్దరు రహస్యంగా ప్రేమించుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ వ్యాపార వేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో అఖిల్‌కి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. నాగచైతన్య మ్యారేజ్ టైమ్‌లోనే అఖిల్ పెళ్లి కూడా చేయాలనుకున్నారు నాగార్జున. కానీ అనూహ్యంగా ఆ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది.
`లెనిన్` సినిమాతో బిజీగా అఖిల్
ఇక అఖిల్ ప్రస్తుతం `లెనిన్` చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్. మురళీ కృష్ణ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్(టీజర్) విడుదలైంది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. అఖిల్ ఈ సారి బలమైన కంటెంట్‌తో వస్తున్నాడని అనిపిస్తుంది. హిట్ ఛాయలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉందట.
