జనవరి పది ముహూర్తమట.. ఇలా యు టర్న్ తీసుకున్నాడేంటి

First Published 30, Dec 2017, 4:07 PM IST
akhil akkineni announces his next project in January
Highlights
  • హలో సక్సెస్ తో మంచి జోష్ లో అఖిల్
  • అఖిల్ తదుపరి సినిమాకు రెడీ
  • జనవరి పదిన తదుపరి సినిమా ప్రకటిస్తానన్న అఖిల్

తొలి సినిమా అఖిల్ తో డిజాస్టర్ ఎదుర్కొన్నా రీలాంచ్ సినిమా అంటూ ‘హలో’తో వచ్చి విజయాన్ని అందుకున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్. హలో సక్సెస్ కావటంతో ఇక అఖిల్ తన తదుపరి సినిమాకు సిద్ధం అవుతున్నాడు. తను చేయబోయే మూడో సినిమా ఏది, దాని దర్శకుడు ఎవరు..? అనే అంశంపై అతిత్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నాడు.

 

అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ కు జనవరి పదవ తేదీని ముహూర్తంగా... నిర్ణయించుకున్నాడు ఈ కుర్ర హీరో. జనవరి పదో తేదీన తన తదుపరి సినిమాను ప్రకటించబోతున్నట్టుగా స్వయంగా అఖిల్ చెప్పాడు. అయితే అందుకు సంబంధించిన క్లూ కూడా ఏమీ ఇవ్వలేదు. అయితే అఖిల్ మాత్రం గ్యాప్ ఏమీ తీసుకోకుండానే... తదుపరి సినిమా గురించి అనౌన్స్ చేయబోతున్నాడు.
 

డెడ్ లైన్లు పెట్టుకోకుంటే పనులు ఏవీ జరగవని.. అందుకే తదుపరి సినిమా అనౌన్స్ మెంట్ కు జనవరి పదో తేదీని డెడ్ లైన్ గా పెట్టుకున్నట్టుగా ఈ హీరో ప్రకటించాడు. మరి అఖిల్ మూడో సినిమాను ఎవరితో చేయబోతున్నాడు, ఎలాంటి సబ్జెక్టుతో రాబోతున్నాడు అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.

loader