నటసింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం అఖండ 2(అఖండ 2 – తాండవం) షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. ఈ సినిమా కోసం తాజా షెడ్యూల్‌ను మూవీ టీమ్ జార్జియా లో స్టార్ట్ చేసింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ2 మూవీ షూటింగ్ షెడ్యూల్‌ జార్జియాలో స్టార్ట్ అయ్యింది. బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ యాక్షన్ బ్లాక్స్‌ను భారీ స్థాయిలో, బాలయ్య బాబుకు తగ్గట్టుగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో ఫారెన్ ఫైటర్స్ కూడా పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక, ఈ జార్జియా షెడ్యూల్‌లోనే బాలకృష్ణ రెండో పాత్రకు సంబంధించిన కీలక ట్విస్ట్ కూడా రివీల్ కానుందని సమాచారం. గతంలో విడుదలైన అఖండ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2 పై అంచనాలు అంతకు మించి ఉన్నాయి. ఎప్పటికప్పుడు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

ఈసినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా మరోసారి సందడి చేయబోతున్నారు. ఇక బాలయ్య మరోసారి అఘోర గెటప్‌లో కనిపించనుండటం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

ఇంతకు ముందు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ కూడా జార్జియాలో జరగగా, ఇప్పుడు అఖండ 2 షూటింగ్ కూడా అక్కడి అద్భుతమైన లోకేషన్లలో చేస్తున్నారు. జార్జియాలోని ప్రకృతి సౌందర్యం, విజువల్ గ్రాండియర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.ఈ భారీ యాక్షన్ డ్రామాను 2025 సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.