బాలకృష్ణ ముద్దుగా అనసూయమత్తో అని పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?
బాలకృష్ణ సినిమాల గురించి, ఆయన పాత్రల గురించి, బాలయ్య మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా కో ఆర్టిస్ట్ లతో, దర్శకులతో బాలయ్య బిహేవియర్ ఎంతో ఇంప్రెస్సీవ్ గా ఉంటుంది. ఇక బాలకృష్ణ గురించి ఓ పాతరం హీరోయిన్ చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమే ఏమన్నారంటే?

Nandamuri Balakrishna
నందమూరి నట సింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయనకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య అంటే అటు ఫ్యాన్స్ లోనే కాదు.. ఇటు కో ఆర్టిస్ట్ లు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాలయ్య బాబు గురించి నెగెటీవ్ గా చెప్పేవారు చాలా తక్కువ. సెట్ లో ఎంత చిన్న దర్శకుడు ఉన్నా.. అతను చెప్పినట్టు విని పనిచేస్తారు బాలకృష్ణ. ఇతర విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరు బాలయ్య బాబు.
Nandamuri Balakrishna
బాలకృష్ణ సెట్ లో అందరితో సరదాగా ఉంటారు. హీరోయిన్లను ఆటపట్టిస్తారు. నిక్ నేమ్ లు పెట్టి పిలుస్తుంటారు. అయితే ఆయన అనసూయమత్తో అని చాలా ముద్దుగా పిలుచుకునే ఓల్డ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు శారద. ఈ పేరు చెపితే గుర్తుపట్టేవారు చాలా తక్కువేమో కాని.. ఊర్వశి శారద అంటే మాత్రం అందరికి అర్ధం అవుతుంది. తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలయాళంలో హీరోలను మించి స్టార్ డమ్ సంపాదించిన శారద.. ఆతరువాత అమ్మ, అత్త పాత్రలో అదరగొట్టారు. ఎందరో స్టార్ హీరోలకు అమ్మగా అత్తగా నటించిన శారద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.
అయితే స్టార్ హీరోలకు అమ్మగా , అత్తగా కనిపించిన శారద బాలయ్య బాబుకి అత్తగా చాలా సినిమాల్లో నటించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన అనసూయమ్మ గారి అల్లు సినిమా మాత్రం బాగా పాపులర్ అయ్యింది. ఆతరువాత నారి నారి నడుమ మురారి లాంటి ఎన్నో హిట్స్ వీరి కాంబోలో వచ్చాయి. అయితే శరద ఎక్కడ కనిపించినా.. బాలయ్య బాబు మాత్రం ఓ హో.. అనసూయమ్మ అత్తో అంటూ ఆటపట్టిస్తారట.
Balakrishna
ఈవిషయాన్ని శరద ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈమూవీలో ఆ పాత్ర చేయాలనంటే కాస్త భయమేసిందట శరదకు. కాని బాలయ్య బాబు మాత్రం.. మీరు అంత పెద్ద నటి.. ఈపాత్ర కోసం అంత భయపడతారేంటండి అని ప్రోత్సహించారట. నిజంగా ఆయనది మంచి మనసు అంటూ వెల్లడించారు ఊర్వశి శారద. వీరి కాంబోలో వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది.
Balakrishna
ఇక 80 ఏళ్ల వయస్సులో శరద సినిమాలు మానేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఆమె యాక్టీవ్ గానే ఉన్నారు. సినిమా ఈవెంట్లకు వెళ్తూనే ఉన్నారు. ఇక బాలయ్య బాబు సినిమాల గురించి చెప్పాలంటే వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీతో డాకూ మహరాజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.