సల్మాన్ తో నడిచిన వ్యవహారం ఓ పీడకలగా మర్చిపోయిన ఐష్.. బిగ్ బి కోడలై తన కుటుంబంతో హాయిగా ఉన్నారు. అయితే, మీడియా ఇప్పుడు.. ఎప్పుడైనా సల్మాన్ పేరెత్తితే మాత్రం ఐష్ కు చిర్రెత్తుకొస్తుంది. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ గురించి‌ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గతంలో మండిపడ్డ సంగతి తెలిసిందే. తాను.. సల్మాన్‌ 2002 మార్చిలో విడిపోయామని, అది తట్టుకోలేకపోయిన సల్మాన్.. రోజూ ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడేవాడని ఐశ్వర్య అప్పట్లో చెప్పారు.

తనకు మరొకరితో సంబంధాలు అంటగట్టి నోటికొచ్చినట్లు తిట్టేవాడని.. చాలాసార్లు తనపై చేయిచేసుకున్నాడని కూడా ఆమె వెల్లడించారు. ఆ దెబ్బలు బయటకి కన్పించేవి కావని.. ఏమీ జరగనట్లే షూటింగ్‌లకు వెళ్తుండేదాన్నని చెప్పింది ఐష్. సల్మాన్‌కి తాగుడు అలవాటు ఉందని తెలిసి అది మాన్పించాలనుకుంటే.. తనపైనే చేయిచేసుకునేవాడని.. అందుకే అతనితో విడిపోయానని..తన్ను మోసం చేస్తున్నట్లు సల్మానే స్వయంగా తనతో చెప్పాడని కూడా ఐశ్వర్య అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఐష్ వ్యాఖ్యలపై సల్మాన్ అప్పట్లో రియాక్టయ్యాడు. నేను కొట్టలేదని.. అప్పుడప్పుడూ తనకు తీవ్రంగా కోపం వస్తుందని అలాంటప్పుడు తనను తానే కొట్టుకుంటానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఆ కీచకపర్వాన్ని మెదడు నుంచి తీసేసి ధైర్యశాలిగా నిలబడింది ఐష్.