జియోపై మరో యుద్ధం ప్రకటించిన ఎయిర్ టెల్

airtel new plan to counter jio dhan dhana dhan offer
Highlights

  • జియోపై వార్ కొనసాగిస్తున్న ఎయిర్ టెల్
  • ట్రాయ్ నిబంధనలు ఉల్లంఘించి జియో పేరు మార్చి అదే ఆఫర్లు ఇస్తోందని ఎయిర్ టెల్ ఆరోపణ
  • తాజాగా జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కు కౌంటర్ గా రూ.399 ప్లాన్ సిద్ధం చేసిన ఎయిర్ టెల్

జియోతో కొనసాగుతున్న యుద్ధాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు ఎయిర్ టెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టెలికాం రంగ నిపుణుడు సంజయ్ బాఫ్నా ట్వీట్ ప్రకారం... రూ.399తో ఒక సరికొత్త ప్లాన్ లాంచ్ చేయనుందని సమాచారం. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1జీబీ 4జీ డేటాతోపాటు 70రోజులపాటు అన్ లిమిటెడ్ కాల్స్ సౌకర్యం కల్పిస్తోంది. అంటే మొత్తం కలిపి 70జీబీ 4జీ డేటా అందించనుంది.

 

ఈ ప్లాన్స్ 4జీ పనిచేసే మొబైల్ ఫోన్స్ లో 4జీ సిమ్ వినియోగించుకునే కస్టమర్లకు అందుబాట్లో ఉంచుతారు. మరోవైపు జియో ధన్ ధనాధన్ ప్లాన్ కు పోటీగా రోజుకు ఒకటి 1జీబీతో, మరోటి 2జీబీతో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఆకర్షణీయమైన ధరలో ఎయిర్ టెల్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అయితే ఎయుర్ టెల్ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన అధికారికంగా చేయకున్నా... టెలికామ్ రంగంలో బాఫ్నా కు ఎంతో ప్రతిష్ట ఉంది కాబట్టి నమ్మాలి.

సో బాఫ్నా ట్వీట్ నిజమైతే.. జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కు ఎయిర్ టెల్ 399 ప్లాన్, రోజుకు ఒక జీబీ డేటా మరియు 70 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ తో ఎయిర్ టెల్ గట్టిగా సమాధానం చెప్పనుందనుకోవాలి.

 

  

గత ఏడాది సెప్టెంబర్ లో రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించాక ఎయిర్ టెల్ కు , జియోకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను రద్దు చేయాలని ట్రాయ్ సూచించడంతో జియో ధన్ ధనా ధన్ ఆఫర్ లాంచ్ చేసింది. దీనిపై ఎయిర్ టెల్ అభ్యంతరాలు చెప్తూనే ఉంది. మొత్తంమీద ఈ వార్ ఇలాగే కంటిన్యూ అవుతుంటే కస్టమర్లకు మాత్రం మరింత మేలు చేకూరటం ఖాయం.

loader