Asianet News TeluguAsianet News Telugu

అజ్ఞాతవాసి ప్రి రిలీజ్ బిజినెస్... నాన్ బాహుబలి టాపర్ ఇదే.. లెక్కలివే

  • పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి
  • రిలీజ్ కు ముందే రికార్డుల మోత మోగిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం
  • ప్రి రిలీజ్ బిజినెసస్ లో నాన్ బాహుబలి టాపర్ గా అజ్ఞాతవాసి
agnyathavaasi pre release business record

దక్షిణాది సినిమాల్లో 150కోట్ల రూపాయల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన 5వ భారీ చిత్రంగా అజ్ఞాతవాసి రికార్డు నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు సాధించిన సినిమాలుగా కేవలం బాహుబలి1, బాహుబలి2, కబాలి, స్పైడర్ చిత్రాలు మాత్రమే నిలిచాయి.

 

ఇక అజ్ఞాత వాసి ఈ విషయంలో కాస్త ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఘనత కేవలం తెలుగు వెర్షన్ తో పాటు, హిందీ సాటిలైట్ డబ్బింగ్ రైట్స్ తోనే సాధించింది. బాహుబలి, స్పైడర్, కబాలి చిత్రాలు డబ్బింగ్ వెర్షన్ రిలీజయ్యాక ఈ రికార్డు నమోదు చేశాయి. అజ్ఞాతవాసి ఈ రికార్డు సాధించిన రెండో తెలుగు సినిమాగా ఘనత సాధించింది.

 

అన్ని ఖర్చులతో కలిపి అజ్ఞాతవాసి థియేట్రికల్ రైట్స్ రూ.128కోట్లు పలికాయి. టాలీవుడ్ లో కేవలం బాహుబలి 1, బాహుబలి 2 మాత్రమే ఈ స్థాయిలో షేర్ సాధించాయి.

అజ్ఞాతవాసి ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా వున్నాయి..

నైజాం- 29కోట్లు

సీడెడ్ – 16.20కోట్లు

యుఏఈ- 11.70కోట్లు

గుంటూరు- 9 కోట్లు

ఈస్ట్ గోదావరి – 8.1 కోట్లు

కృష్ణా- 7 కోట్లు

వెస్ట్ – 6.75 కోట్లు

నెల్లూరు- 4.05కోట్లు

ఎపి/తెలంగాణ – 91.80 కోట్లు

కర్ణాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశం- 11.70కోట్లు

ఓవర్సీస్ – 19 కోట్లు

వరల్డ్ వైడ్ – 122.50 కోట్లు

శాటిలైట్ రైట్స్ – 32 కోట్లు

ఆడియో హక్కులు – 2కోట్లు

మొత్తం- 156.50కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios