Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిపై ఫ్రెంచ్ డైరెక్టర్ స్పందన

  • పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న అజ్ఞాతవాసి
  • గత కొంత కాలంగా ఫ్రెంచ్ సినిమా కాపీ అంటూ రూమర్స్
  • తాజాగా అజ్ఞాతవాసిపై ఫ్రెంచ్ డైరెక్టర్ ట్వీట్
agnyathavaasi creating news worldwide with copy right issue

పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఇప్పుడు ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ తెగ పబ్లిసిటీ అవుతోంది. అలాంటి రూమర్లను వినేసి టి సిరీస్ వారు.. ఈ సినిమా కథ గురించి తెలుసుకుని.. రిలీజ్ అయ్యాక సినిమా చూసి.. నిర్మాతకు లీగల్ నోటీస్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు లార్గో ఫించ్ దర్శకుడు జిరోమ్ సెలే.. ట్విట్టర్లో ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేయడంతో.. ప్రపంచం అంతా ఈ విషయం రచ్చయ్యేలా ఉంది. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి మూవీ టికెట్., దానికన్నా ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటూ ట్వీటేశాడు.



ఆన్ లైన్లో వచ్చిన అజ్ఞాతవాసి కాపీ అంట.. టి సిరీస్ వారు లీగల్ నోటీస్ ఇస్తున్నారు అనే న్యూస్ ను తనకు ఎవరో ఫ్యాన్స్ చేరవేయడంతో.. ఆ న్యూస్ లింకుతో పాటు ఈ ట్వీటును వేశాడు సదరు ఫారిన్ డైరక్టర్. ఒకవేళ నిజంగానే అజ్ఞాతవాసి సినిమాను చూసి.. అసలు తను తీసిన వర్షన్ ఎందుకు పెద్దగా ఆడలేదు.. త్రివిక్రమ్ తీసిన ఈ సినిమా రిలీజ్ కంటే ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ ఎలా చేసిందో తెలుసుకుంటాడా ఏంటి? 

 

2008లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా లార్గో ఫించ్. బెల్జియంకు చెందిన ఒక కామిక్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కట్ చేస్తే దానిని ఇంగ్లీషులోకి అనువదించి.. ది హేర్ అపారెంట్ పేరుతో కూడా రిలీజ్ చేశారు. కమర్షియల్ సక్సెస్ పెద్దగా లేని ఈ సినిమాను కాపీ కొట్టేసి తెలుగులో అజ్ఞాతవాసి అంటూ తీస్తున్నారని ఇప్పుడు పెద్ద న్యూస్ అయిపోయింది. ఇందులో నిజమెంతో త్రివిక్రమ్ కే తెలియాలిలే.

Follow Us:
Download App:
  • android
  • ios