అజ్ఞాతవాసి కథ లీక్... ఇదేనంటూ వైరల్

First Published 28, Nov 2017, 10:46 AM IST
agnyaathavaasi story leaked
Highlights
  • పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాతవాసి
  • క్రేజీ కాంబినేషన్ లో వస్తోన్న చిత్ర కథ లీక్
  • హాలీవుడ్ మూవీ కాపీ అంటూ  ఓ కథపై ప్రచారం

త్రివిక్రమ్ సినిమాల్లో చాలా వరకు హాలీవుడ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. హాలీవుడ్ సినిమాలపై తనకున్న పట్టు కారణంగా.. కొన్ని సీన్స్ లో కాపీ కొట్టారనే కామెంట్ కూడా వినపడుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న అజ్ఞాతవాసి కథ కూడా హాలీవుడ్  సినిమా అయిన ”ది హెయిర్ అప్పారెంట్”  సంబంధించింది అనే టాక్ వినిపిస్తోంది.

 

కథ విషయానికొస్తే ఒక   ధనవంతుడికి  ఇద్దరు భార్యలు ఉంటారట. ఓ కుట్రలో ఆయన చనిపోతాడు. ధనవంతుడికి సంబంధించిన  ఆస్తి మొత్తం విలన్లు  దోచేయాలని   అనుకుంటారు, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొదటి భార్యకు ఓ కొడుకు ఉంటాడు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలీదు, పేరు తో సహా ఏమీ తెలీదు.. అతని సంతకం లేనిదే ఆస్తులను టచ్ చేయలేరు.

 

ఆ ధనవంతుడి రెండో భార్య.. మొదటి భార్య కొడుకు కోసం వెదుక్కుంటూ వస్తుంది. అ తర్వాత కధ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా స్టొరీ. ఇటువంటి కథ కలిగిన సినిమాను  తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని త్రివిక్రమ్ కూడా ఈ లైన్ కి ఫ్లాట్ అయిపోయాడట. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని అజ్ఞాతవాసి ని అఫీషియల్ గా ప్రకటించారు. ‘ప్రిన్స్ ఇన్ ఎక్సిల్’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు.

 

ప్రస్తుతం ఇదే అజ్ఞాతవాసి స్టోరీ అంటూ ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది అంటూ సోషల్ మీడియా లో హల్చల్ జరుగుతోంది. పవర్ స్టార్ ఫాన్స్ లో కొందరు ఇది లీక్ స్టోరీ ని నమ్మి బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. మరి హాలీవుడ్ స్టోరీని మార్చి తీశాడో లేక మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకున్నాడో వేచి చూడాలి.

loader