అజ్ఞాతవాసికి సంబంధించి ఇది నిజమేనా...

అజ్ఞాతవాసికి సంబంధించి ఇది నిజమేనా...

పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా సినిమా ట్రైలర్ రిలీజ్‌పై మాత్రం క్లారిటీ లేదు. డిసెంబర్ 25న ట్రైలర్ రిలీజ్ ఉంటుందని తొలుత ప్రకటించినా కాకపోవడంతో... పవన్ అభిమానులు ట్రైలర్ ఎప్పుడొస్తుందా? అని టెన్షన్ లో ఉన్నారు. ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించి తాజాగా మరో ఊహాగానం తెర పైకి వచ్చింది.

 

తాజా సమాచారం ప్రకారం జనవరి 4 లేదా 5న అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేయాలని భావించినప్పటికీ.. అదే రోజు బన్నీ సినిమా 'నా పేరు సూర్య' టీజర్ వస్తుండటంతో అజ్ఞాతవాసి ట్రైలర్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

 

ట్రైలర్ రిలీజ్ వాయిదా పడటంతో పవన్ అభిమానులు ఇక ఆయన పాటతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే పాటపై ఉన్న అంచనాల రీత్యా.. ట్రైలర్ వాయిదా పడ్డ లోటును అది తీరుస్తుందని భావిస్తున్నారు. దీంతో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 'కొడుకా.. కోటేశ్వరరావు..' పాట పవన్ అభిమానులను ఊపేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

 

డిసెంబర్ 29న అజ్ఞాతవాసి సెన్సార్ బోర్డు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సెన్సార్ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా ఫస్ట్ కాపీ సిద్దం చేసి.. క్యూబ్ వారిక అప్ లోడ్ చేసే పనిలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

సెన్సార్ రిపోర్టును బట్టి అజ్ఞాతవాసిపై మరిన్ని అంచనాలు ఏర్పడే అవకాశముంది. సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా వస్తే పవన్ సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటడం ఖాయం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో.. ఆయన డైలాగ్స్ పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆ డైలాగ్స్ తెరపై చూడాలంటే జనవరి 10వరకు ఆగాల్సిందే.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page