ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మూవీ లవర్స్ నుండి వినిపిస్తున్న ఒకేఒక్క మాట అజ్ఞాతవాసి.. అజ్ఞాతవాసి.. అజ్ఞాతవాసి.. అజ్ఞాతవాసి... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాతవాసి చిత్రంలో టాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ బ్యూటీస్ అను ఇమ్మానుయేల్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండటం మరింత క్రేజ్ పెంచింది.

 

ఇక ‘అజ్ఞాతవాసి’ రిలీజ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో పవన్ అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ జనవరి 10వతేదీన థియేటర్స్‌ కి వస్తున్నప్పటికీ మిడ్ నైట్ షోల రూపంలో కొన్ని గంటల ముందే సందడి షురూ చేసేందుకు పవన్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

 

జనవరి 9వ తేదీ అర్థరాత్రి నుండే ఏపీలో అనేక చోట్ల మిడ్‌నైట్ షోలను ఏర్పాటుచేశారు. ఇక తెలంగాణలోనూ మిడ్ నైట్ షోలకు అనుమతి రావటంతో టైమ్ కోసం నిరీక్షిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇకపోతే ఈ మిడ్‌నైట్ షోలకు మూడు నుండి ఐదువేల రూపాయల వరకూ అమ్ముడవుతున్నాయి. అయితే పవన్ మూవీని కొన్ని గంటలు ముందు చూస్తున్నాం అనే ఉత్సాహంలో టికెట్‌ రేటు ఎంతైనా పర్వాలేదంటున్నారు ఆయన ఫ్యాన్స్.

 

దీంతో పవన్ ‘అజ్ఞాతవాసి’ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని అత్యధిక థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్‌లోనూ అత్యధిక స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతున్న చిత్రంగా ‘అజ్ఞాతవాసి’ రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది. పవన్ త్రివిక్రమ్ కాంబోకి ఉన్న పాజిటివ్ బజ్‌తో ‘అజ్ఞాతవాసి’ పాత రికార్డులను బ్రేక్ చేసి బాక్సాఫీస్ బిగ్‌బాస్ కావడం ఖాయం అంటున్నారు ఆయన అభిమానులు.