అజ్ఞాతవాసి కథలో దమ్మున్నా దాన్ని తెరపై స్క్రీన్ ప్లేతో త్రివిక్రమ్ ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇప్పుడు కొంత మాడిఫై చేస్తున్నారని సమాచారం. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో స్పెషల్ కామియో లో కనిపించిన సీన్లను ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన డబ్బింగ్ వీడియోను విడుదల చేశారు.

సంక్రాంతి రోజు నుంచి ఈ సీన్ ను సినిమాకు యాడ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని సినిమాకు మైనస్ అయిన సీన్లను కూడా తొలగిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా నిడివి దాదాపు 12 నిమిషాల వరకూ తగ్గుతుందని సమాచారం. ఎలాగూ వెంకీ నటించిన సీన్లను యాడ్ చేస్తున్నారు కాబట్టి.. వాటి కోసమైనా కొన్ని సీన్లను ట్రిమ్ చేయాలనే లెక్కతో సినిమాలో ఆకట్టుకోని సీన్లను కట్ చేస్తున్నారని తెలుస్తోంది.

మైనస్ అవుతున్న 12 నిమిషాల కంటెంట్ ను తొలగించేసి.. వెంకీ సీన్లను యాడ్ చేసేసి సినిమాను మళ్లీ మాడిఫై చేస్తున్నారట.  తర్వాతి వెర్షన్ ను రేపటి నుంచి థియేటర్లలో చూడవచ్చని సమాచారం.