తొలిప్రేమ హిట్ తర్వాత ప్రభాస్ పై వరుణ్ సెటైర్లు

First Published 15, Feb 2018, 9:15 PM IST
after tholi prema hit varuntej satires on prabhas nitin
Highlights
  • తొలిప్రేమతో హిట్టు కొట్టిన వరుణ్ తేజ్
  • వరుణ్ తేజ్ కు పెళ్లిపై ప్రశ్నలు
  • పెళ్లిపై ప్రశ్నలు ఎదురు కావటంతో ప్రభాస్ పై సెటైర్లు

తొలిప్రేమ సూపర్ సక్సెస్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సంతోషం మునిగి తేలుతున్నాడు. ఫిదా, తొలిప్రేమ వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలు దక్కడంతో వరుణ్ తేజ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. తొలిప్రేమ చిత్రం వరుణ్ తేజ్ ని నటుడిగా అన్ని యాంగిల్స్ లో ఆవిష్కరించింది. ఈ మెగా హీరోపై ప్రశంసలు దక్కుతున్నాయి. వరుణ్ ప్రస్తుతం పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పెళ్లి ప్రస్తావన రాగా ప్రభాస్, నితిన్ పై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. దీనితో టాలీవుడ్ లో మరో మారు పెళ్లి కానీ ప్రసాద్ ల గురించి చర్చ మొదలైంది.

 

తొలిప్రేమ సక్సెస్ సాధించడంతో లీడ్ పెయిర్ వరుణ్, రాశి ఖన్నా పోస్ట్ రిలీజ్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా వరుణ్ ప్రేమ పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ ప్రస్తావన తీసుకుని వచ్చింది. తన పెళ్లి గురించి చెబుతూ వరుణ్ తనకన్నా సీనియర్ హీరోల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

 

టాలీవుడ్ లోనే కాదు ఇండియాలో కూడా ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. థర్టీ ప్లస్ లోకి అడుగుపెట్టినా ఈ బాహుబలి ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. నీ పెళ్లెప్పుడని వరుణ్ ని ప్రశ్నించగా.. తనకన్నా సీనియర్లు పెళ్లి కావలసిన వారు చాలా మందే ఉన్నారు. ప్రభాస్ అన్నయ్యకు కూడా ఇంకా పెళ్లి కాలేదుగా అంటూ వరుణ్ సెటైర్ వేసాడు. తన సీనియర్ నితిన్ కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదని వాళ్ళందరి పెళ్లి అయ్యాక తన పెళ్లి గురించి ఆలోచిస్తానని వరుణ్ తెలపడం విశేషం.

 

టాలీవుడ్ లో పెళ్లి కానీ ప్రసాదుల జాబితాలో చాలా మందే ఉన్నారు. విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న రానా దగ్గుబాటి కూడా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరే. 33 ఏళ్ల వయసున్న రానాకు ఇంకా పెళ్లి గడియలు దగ్గరపడలేదు. ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా 30 కి రీచ్ అవుతున్నాడు. మనవాడు కూడా పెళ్లి గురించి పట్టించుకోకుండా కెరీర్ లో బిజీగా గడుపుతున్నాడు.

 

మేనమామల పోలికలతో ఉన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా కెరీర్ పరంగా రాణిస్తున్నాడు. తేజు కూడా ఇంత వరకు పెళ్లి ఊసే ఎత్తలేదు. అదే దారిలో నిఖిల్, శర్వా నిఖిల్, శర్వానంద్ వంటి హీరోలు చాలా కాలంగా టాలీవుడ్ లో స్థిరపడ్డారు. వీళ్లంతా ఇప్పటి వరకు పెళ్లీడు మీద పడ్డా... ఆ ఊసెత్తట్లేదు.

loader