Asianet News TeluguAsianet News Telugu

“మేజర్” రిలీజ్ డేట్ ఖరారు చేసిన మహేష్

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం అని తెలిపారు దర్శకుడు.  

Adivi Sesh Major gets a release date
Author
Hyderabad, First Published Nov 3, 2021, 11:36 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ సందీప్‌ ఉన్ని కృష్షన్‌ జీవితం ఆధారంగా ‘మేజర్’‌ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అడవి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న  ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. 

ప్రస్తుతం ‘మేజర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కొత్త విడుదల తేదీ గురించి మేకర్స్ ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. ‘మేజర్’ చిత్రం 2022 ఫిబ్రవరి 11న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మేజర్’ విడుదల తేదీని ప్రకటిస్తూ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు.

Also read Suma kanakala: వెండితెర రీఎంట్రీకి సిద్దమైన యాంకర్ సుమ.. మైండ్ బ్లోయింగ్ డిటైల్స్

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం అని తెలిపారు దర్శకుడు. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది చిత్ర యూనిట్‌. 
 Also read పునీత్ రాజ్ కుమార్ ని అవమానిస్తూ పోస్ట్.. నెటిజన్ అరెస్ట్, అంతా శోకంలో మునిగిపోయిన వేళ
75 లొకేషన్లలో 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం 8 భారీ సెట్లు నిర్మించారు. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేజర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ‘మేజర్’లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్ బ్యానర్ లపై ‘మేజర్‌’ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీత స్వరకర్త. 

Follow Us:
Download App:
  • android
  • ios