Asianet News TeluguAsianet News Telugu

Suma kanakala: వెండితెర రీఎంట్రీకి సిద్దమైన యాంకర్ సుమ.. మైండ్ బ్లోయింగ్ డిటైల్స్

1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సుమ, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారు. హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నంలో మలయాళ, తెలుగు చిత్రాలలో నటించారు.

star anchor suma all set to make his silver screen re entry
Author
Hyderabad, First Published Nov 3, 2021, 9:33 AM IST


స్టార్ యాంకర్ సుమ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరను మకుటం లేని మహారాణిగా ఏలేస్తుంది. యాంకర్ గా లెక్కకు మించిన షోలు చేసిన, చేస్తున్న Anchor Suma, పెద్ద హీరోల సినిమా ఫంక్షన్స్ లో వాలిపోతారు. కేరళలో పుట్టిపెరిగిన ఈ మలయాళీ భామ తెలుగుపై పట్టు సాధించి, తిరుగులేని యాంకర్ గా ఎదిగారు. అయితే సుమ పరిశ్రమకు పరిచయమైంది, మాత్రం హీరోయిన్ గా. 


1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సుమ, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారు. హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నంలో మలయాళ, తెలుగు చిత్రాలలో నటించారు. ఈ క్రమంలో ఆమె నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. నటిగా అవకాశాలు సన్నగిల్లుతున్న తరుణంలో సుమ, తెలివిగా యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. యాంకర్ గా సుమ సూపర్ సక్సెస్ సాధించారు. యాంకర్ గా బిజీ అయినప్పటికీ తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తూ ఉంటారు. 


వర్షం, ఢీ, బాద్ షా, ఓ బేబీ చిత్రాలలో సుమ చిన్న చిన్న పాత్రలు చేశారు. అయితే చాలా కాలం తరువాత ఆమె నటిగా పూర్తి స్థాయిలో కనిపించనున్నట్లు ప్రకటించారు. దీనిని ధృవీకరిస్తూ నిన్న ఓ వీడియో విడుదల చేశారు. పరిశ్రమకు చెందిన చాలా మంది తారలు, సెలెబ్రిటీలు తనను నటించమని అడుగుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోతో సుమ టాలీవుడ్ రీఎంట్రీ పై స్పష్టత రావడం జరిగింది. 


అయితే సుమ ప్రధానంగా ఆ మూవీ తెరకెక్కనుందా, లేదా కీలక రోల్ చేస్తున్నారా అనే సమాచారం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆమె ఫ్యాన్స్ కి ఇది కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. మరోవైపు కొడుకు రోషన్ కనకాలను  హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాల్లో సుమ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also read Rajamouli: రాజమౌళి అనుభవించిన దుర్భర పరిస్థితులు... అందుకే దానాలకు దూరమా!
ఇటీవల సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్న తరుణంలో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ అపోహలే అని ఓ టీవీ కార్యక్రమం ద్వారా ఈ జంట తెలియజేశారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో సుమతో విడిగా వేరే ఇంట్లో ఉన్న విషయం వాస్తవమే, కానీ విభేదాల వలన కాదు, అంటూ రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios