ఆ నిర్మాత కాంప్రమైజ్ అవ్వమని అడిగాడు.. అతిథిరావు షాకింగ్ కామెంట్స్

Aditi Rao Hydari opens up on her casting couch experience
Highlights

 బాలీవుడ్ నిర్మాత నా దగ్గరకు వచ్చాడు. ఆఫర్ ఇస్తానని, కాంప్రమైజ్ కావాలని కోరాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే అలా అడుగుతాడు. అలాంటి తప్పుడు దారుల్లో వెళుతూ అవకాశాలు దక్కించుకోవడం అవసరమా అనిపించింది.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు నటీమణులు అంటుంటే మరికొందరు మాత్రం తమకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెబుతున్నారు. కొందరు బహిరంగంగానే తమతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారి పేర్లను వెల్లడించారు. తాజాగా హీరోయిన్ అతిథిరావు హైదరి కూడా కాస్టింగ్ కౌచ్ కారణంగానే సినిమాలకు దూరమయ్యాను అని చెబుతోంది. హైదరాబాద్ బ్యూటీ అయిన అతిథిరావు తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. 2006లో ఓ మలయాళ సినిమా ద్వారా నటిగా పరిచయమైన అతిథి ఆ తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. దీనికి గల కారణాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'నేను సినిమాలోకి వచ్చి పదేళ్లు దాటింది. కాస్టింగ్ కౌచ్ కారణంగానే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. కెరీర్ ఆరంభంలో ఓ బాలీవుడ్ నిర్మాత నా దగ్గరకు వచ్చాడు. ఆఫర్ ఇస్తానని, కాంప్రమైజ్ కావాలని కోరాడు.

నాకు చాలా కోపం వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే అలా అడుగుతాడు. అలాంటి తప్పుడు దారుల్లో వెళుతూ అవకాశాలు దక్కించుకోవడం అవసరమా అనిపించింది. అందుకే చాలా రోజులు ఖాళీగా ఉండిపోయాను. ఆ తరువాత వాటంతటవే సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రతిభ ఉండి నిజాయితీగా ఉంటే సినిమాల్లో రాణించవచ్చని తెలుసుకున్నాను'' అంటూ వెల్లడించింది. 
 

loader