అందంలోనే కాదు అందులోనూ సత్తా చాటుతోన్న హీరోయిన్లు.. తగ్గేదేలే అంటూ..
హీరోయిన్ల అభిరుచులు మారుతున్నాయి. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోనూ తమదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ఓవైపు నటనలో తమ ప్రతిభను చూపిస్తేనే మరోవైపు నిర్మాణ రంగంలో మంచి విజయాలను అందుకుంటున్నారు. టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన కొందరు ముద్దుగుమ్మలు తమదైన శైలిలో రాణిస్తూ నిర్మాణం రంగంలో సత్తా చాటుతున్నారు. అలాంటి కొందరు నటీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నిహారిక కొణిదెల
నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. సినిమా ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునేందుకు ఎంతో కష్టపడుతోంది నిహారిక. పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ముద్దపప్పు ఆవకాయ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా కమిటీ కుర్రొళ్లు సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నిర్మాతగా సత్తాచాటింది.
ఛార్మీకౌర్
హీరోయిన్‌గో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి ఛార్మీకౌర్ ఆ తర్వాత సినిమాలకు క్రమంగా దూరమవుతూ వచ్చింది. ఆ తర్వాతే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో చేతులు కలిపిన ఛార్మీ నిర్మాతగా మారి పలు చిత్రాలను తెరకెక్కించింది. ఇస్మార్ట్ శంకర్‌తో భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ఛార్మీ.. ఆ తర్వాత లైగర్,డబుల్ ఈస్మార్ట్‌తో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే వీరి కాంబినేషన్‌లో మరిన్ని చిత్రాలు తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
తాప్సీ
తెలుగు సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన అందాల తార ఛార్మీ. ఆ తర్వాత బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించి మెప్పించింది. ఇక హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఛార్మీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. బ్లర్ర్ సినిమాతో సినిమా నిర్మాణాలను ప్రారంభించింది. తొలి సినిమాతోనే తన టేస్ట్ ఎలాంటిదో చెప్పింది.
నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార సంపాదించుకున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నయనతార దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. హీరోయిన్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి సహ నిర్మాతగా మారింది. భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి పలు సినిమాలను తెరకెక్కించింది.
నిత్యా మీనన్
అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల తార నిత్యా మీనన్ ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ తొలిసారి స్కైలాబ్ మూవీతో నిర్మాతగా మారింది. ఇందులో లీడ్ రోల్‌లో కూడా నటించి మెప్పించింది.
అమలాపాల్
నటిగా ప్రేక్షకులను మెప్పించిన అమలాపాల్ సైతం నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తొలి చిత్రం కడవర్తోతోనే తన ఖాతాలో మంచి విజయాన్ని వేసుకుంది. ఫోరెన్సిక్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పిట్ట కథలు అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది.