త్రిష కొత్త లవర్ ఎవరు..?

actress trisha again fall in love
Highlights

కొంతకాలం క్రితం వ్యాపారవేత్త వరుణ్ మనియన్ ను ప్రేమించి నిశ్చితార్ధం చేసుకున్న త్రిష పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకుంది. ఆ తరువాత కొద్దిరోజులు టూర్స్, సినిమాలు అంటూ బిజీబిజీగా సమయం గడిపిన త్రిషకు ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన త్రిష ఇప్పుడు కోలివుడ్ లో తన సత్తా చాటుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మోహిని, గర్జన వంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో పాటు 96, చతురంగవేట్టై2, 1818 వంటి చిత్రాలలో నటిస్తోంది. ఈ సినిమాలు చేతిలో ఉండగానే కొత్త కథలు వింటున్నానని, త్వరలోనే ఒక సంచనల చిత్రం గురించిన విషయం వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది.

కొంతకాలం క్రితం వ్యాపారవేత్త వరుణ్ మనియన్ ను ప్రేమించి నిశ్చితార్ధం చేసుకున్న త్రిష పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకుంది. ఆ తరువాత కొద్దిరోజులు టూర్స్, సినిమాలు అంటూ బిజీబిజీగా సమయం గడిపిన త్రిషకు ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. ఇటీవల ఎత్తైన ప్రాంతానికి వెళ్లి అక్కడ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ బ్యూటీ తాజాగా.. 'ఏ టేబుల్ ఫర్ టూ' అంటూ హార్ట్ సింబల్స్ తో ఓ పోస్ట్ పెట్టింది.

దీంతో త్రిష మళ్లీ ప్రేమలో పడిందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఎవరా లక్కీ ఫెలో..? అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు త్రిషకు కంగ్రాట్స్ చెప్పారు. మరి ఈ విషయాన్ని త్రిష అధికారికంగా చెబుతుందేమో చూడాలి!

loader