గాయత్రి గుప్తా వల్లే నా జీవితం ఇలా తయారయ్యింది-శ్రీ రెడ్డి

గాయత్రి గుప్తా వల్లే నా జీవితం ఇలా తయారయ్యింది-శ్రీ రెడ్డి

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగౌ కౌచ్ కి వ్యతిరేకంగా... యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి. గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. ఇండస్ట్రీలో అవకాశాల పేరులో అమ్మాయిలను వాడుకోవడం.. తనను తనతో పాటు మరికొంతమందిని శారీరక, మానసిక హింసపై మీడియాకి ఎక్కింది ఈ తెలుగు నటి. అయితే తెలుగు పరిశ్రమ పెద్దలపై పలు సంచలన ఆరోపణలతో హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి అసలు తను ఇలా మారటానికి కారణం ఏంటో చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎవరో చెప్పలేదు.

 

అయితే అసలు తను పోరాటం మొదలు పెట్టడానికి బీజం పడిందే గాయత్రి గుప్తా వల్ల అంటూ బాంబ్ పేల్చింది. ఎందుకంటే.. తను గాయత్రి మంచి స్నేహితులమని, గాయత్రి తనకు జరిగిన అన్యాయంపై.. నోరు విప్పినా.. కొంత కాలం మాత్రమే మాట్లాడేసి.. ననయానో భయానో.. ఇష్యూను వదిలేసిందని, తాను అక్కడే ఆలోచనలో పడ్డానని శ్రీ రెడ్డి స్పష్టం చేసింది. గాయత్రి లాంటి. తన లాంటి ఎందరో అమ్మాయిలు ఇండస్ట్రీలో నిలదొక్కుకుందామని వచ్చి.. అవకాశాల కోసం పక్కలు పరచాల్సి రావటం వెనుక దాగున్న కుట్రల గుట్టు విప్పుతున్నానని శ్రీ రెడ్డి అంటోంది.

 

తమను బరితెగిస్తున్నారని అందరూ అంటున్నారని... కానీ అవకాశాల కోసం వెళితే పక్క పరిచేలా దిగజారుస్తారని, తమ కష్టాల గురించి నిజం తెలిసిన వాళ్లెవరూ తమ పట్ల అలాంటి దారుణమైన కామెంట్లు చేయరని శ్రీ రెడ్డి స్పష్టం చేసింది. మరి తన ఉద్యమం ఎందాక వెళ్తుందో చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos