రోజుకి రూ.20 వేలు అనగానే ఛీ.. అనిపించింది: షకీలా

actress shakeela about regarding her chance in chennai express movie
Highlights

రోజుకి రూ.20 వేలు మాత్రం ఇస్తామని.. ఆడిషన్ కు రావాలని సత్యరాజ్ ముందే చెప్పడంతో నాకు తలకొట్టేసినంత పని అయింది. ఏంటి నా విలువ రోజుకి 20 వేలా అని చాలా బాధ పడ్డాను. అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ నాకు రోజుకి 20 వేలు ఇస్తామని చెప్పడం నాకు నచ్చలేదు

మలయాళ చిత్రీసీమను ఓ ఆట ఆడించింది షకీలా.. స్టార్ హీరోలు సైతం ఆమె సినిమా విడుదలవుతుందంటే భయపడే పరిస్థితి. ఆమె సినిమాల కారణంగా తమ సినిమాల కలెక్షన్స్ ఎక్కడ తగ్గుతాయేమోనని ఆమె సినిమాలకు సెన్సార్ రాకుండా, వచ్చినా బ్యాన్ చేసే విధంగా ఏదోకటి చేసేవారు. అయినప్పటికీ ఆమె నటించిన సినిమాలు చాలా వరకు బాగానే ఆడేవి. తరువాత సినిమా అవకాశాలు తగ్గడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారామె..

తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పుడు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదని చెప్పుకొచ్చింది. తన కెరీర్ లో హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయని కానీ తను అంగీకరించలేదని తెలిపారు. ''అవకాశాలు తగ్గిన తరువాత 2013లో షారుఖ్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో ఒక ఛాన్స్ వచ్చింది. సత్యరాజ్ పక్కన కనిపించే రోల్ అది. అయితే ఆ సినిమా కోసం నన్ను సంప్రదించిన తీరు ఎంతో బాధను కలిగించింది.

చిత్రబృందం నా ఇంటికి వచ్చి చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించమని అడిగారు. కానీ రోజుకి రూ.20 వేలు మాత్రం ఇస్తామని.. ఆడిషన్ కు రావాలని సత్యరాజ్ ముందే చెప్పడంతో నాకు తలకొట్టేసినంత పని అయింది. ఏంటి నా విలువ రోజుకి 20 వేలా అని చాలా బాధ పడ్డాను. అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ నాకు రోజుకి 20 వేలు ఇస్తామని చెప్పడం నాకు నచ్చలేదు. నా జీవితంలో అదొక చేదు అనుభవం'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  

loader