మా అధ్యక్షుడు శివాజీ రాజా వాళ్లకి పరిచయం చేస్తానని... చాలా మందిని వాడుకున్నాడు

First Published 16, Apr 2018, 3:48 PM IST
Actress sensational comments on maa president sivaji
Highlights

మా అధ్యక్షుడు శివాజీ రాజా వాళ్లకి పరిచయం చేస్తానని... మభ్యపెట్టాడు

 తెలుగు నటి శృతి తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ ఏకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజాపై సంచలన ఆరోపణలు చేసింది. ఓ మీడియా ఛానల్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో మాట్లాడుతూ..  ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న శివాజీరాజా తనను మభ్యపెట్టేందుకు ప్రయత్నించాడంటూ ఆరోపణలు చేసింది శృతి. 

శివాజీ రాజా నన్ను గతంలో హీరో శ్రీకాంత్‌కి పరిచయం చేస్తా.. దర్శకుడు కృష్ణవంశీకి పరిచయం చేస్తా అంటూ మభ్యపెట్టాడు. వేరే అమ్మాయిలను కూడా వాడుకున్నాడు. వాళ్లు కూడా బయటకు వచ్చి ఆధారాలతో సహా బయటపెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి వాళ్లు పెద్దలుగా ఉన్న ‘మా’ ద్వారా మాకేం న్యాయం జరుగుతుందని మేం భావించడం లేదు’ అంటూ ఆరోపణలు చేసింది.
 

loader